Vijay Deverakonda 12th Movie: విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్‌-music director locked for vijay devarakonda gowtam tinnanuri movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Music Director Locked For Vijay Devarakonda Gowtam Tinnanuri Movie

Vijay Deverakonda 12th Movie: విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 26, 2023 05:14 PM IST

Vijay Deverakonda 12th Movie: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంగీతాన్ని అందించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అత‌డు ఎవ‌రంటే...

అనిరుధ్
అనిరుధ్

Vijay Deverakonda 12th Movie: లైగ‌ర్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాల్ని అంగీక‌రిస్తోన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. . ప్ర‌స్తుతం మూడు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొంద‌నుంది. ఈ ప్రాజెక్ట్‌కు కోలీవుడ్ సెన్సేష‌న‌ల్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ సంగీతాన్ని అందించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. యాక్ష‌న్ క‌థాంశ‌మే అయినా మ్యూజిక్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంద‌ని, అందుకే సంగీత ద‌ర్శ‌కుడిగా అనిరుధ్‌ను చిత్ర యూనిట్ తీసుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అనిరుధ్ ఈ సినిమాలో భాగ‌మ‌వ్వ‌డంపై త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ పోలీస్ లుక్‌లో క‌నిపించ‌బ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ల‌వ్‌, ఎమోష‌న్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ గ‌త సినిమాల్ని తెర‌కెక్కించారు గౌత‌మ్ తిన్న‌నూరి. వాటికి భిన్నంగా కంప్లీట్ యాక్ష‌న్ అంశాల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ గూఢ‌చారిగా న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్నారు. రామ్‌చ‌ర‌ణ్‌తో గౌత‌మ్ తిన్న‌నూరి ఓ సినిమా చేయాల్సింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోవ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను అనౌన్స్‌చేశాడు గౌత‌మ్ తిన్న‌నూరి.

IPL_Entry_Point