Vijay Devarakonda Gowtam Tinnanuri Movie: జెర్సీ ద‌ర్శ‌కుడికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌-vijay devarakonda join hands with jersey director for a romantic love story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Devarakonda Join Hands With Jersey Director For A Romantic Love Story

Vijay Devarakonda Gowtam Tinnanuri Movie: జెర్సీ ద‌ర్శ‌కుడికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 20, 2022 08:23 AM IST

Vijay Devarakonda Gowtam Tinnanuri Movie: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా జెర్సీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌య్యే అవ‌కాశం ఉందంటే...

విజ‌య్ దేవ‌ర‌కొండ
విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Devarakonda Gowtam Tinnanuri Movie: జెర్సీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరితో యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ స‌ర్కిల్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. నాని హీరోగా న‌టించిన జెర్సీ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల మెప్పును పొందాడు గౌత‌మ్ తిన్న‌నూరి. ఓ క్రికెట‌ర్‌ జీవితం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా రెండు జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకున్న‌ది.

క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. హిందీలోనూ ఈ సినిమాను షాహిద్ క‌పూర్‌తో రీమేక్ చేశాడు గౌత‌మ్ తిన్న‌నూరి. తాజాగా అత‌డు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫీల్‌గుడ్ ల‌వ్ స్టోరీతో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ సిద్ధం చేసిన పాయింట్ న‌చ్చ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌లే ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. డిఫ‌రెంట్ పాయింట్‌తో విజ‌య్‌, గౌత‌మ్ సినిమా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఖుషి (Kushi) సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ బిజీగా ఉన్నాడు. స‌మంత (Samantha) హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ ల‌వ్ స్టోరీ డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌కానుంది. లైగ‌ర్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

కానీ లైగ‌ర్ (Liger) డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే గౌత‌మ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైన‌ట్లు చెబుతున్నారు. మ‌రోవైపు జెర్సీ హిందీ రీమేక్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేసేందుకు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి సిద్ధ‌మ‌య్యారు.

కానీ అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ పాన్ ఇండియ‌న్ సినిమా షూటింగ్‌తో ఫుల్‌బిజీగా ఉన్నాడు రామ్‌చ‌ర‌ణ్‌ (Ramcharan). ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టిసారించాల‌ని అత‌డు డిసైడ్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ పాన్ ఇండియ‌న్ ప్రాజెక్ట్ పూర్తవ్వ‌డానికి స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉండంతోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను డైరెక్ట‌ర్‌ గౌత‌మ్ అప్రోచ్ అయిన‌ట్లు చెబుతున్నారు. విజ‌య్‌, గౌత‌మ్ తిన్న‌నూరి సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

IPL_Entry_Point