Shakuntalam OTT Release: శాకుంతలం ఓటీటీ వేదిక ఫిక్స్.. ఎప్పుడు? ఎందులో అంటే?-samantha shakuntalam movie ott update when and where to watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shakuntalam Ott Release: శాకుంతలం ఓటీటీ వేదిక ఫిక్స్.. ఎప్పుడు? ఎందులో అంటే?

Shakuntalam OTT Release: శాకుంతలం ఓటీటీ వేదిక ఫిక్స్.. ఎప్పుడు? ఎందులో అంటే?

Maragani Govardhan HT Telugu
Apr 15, 2023 02:26 PM IST

Shakuntalam OTT Release: సమంత నటించిన శాకుంతలం ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్సయింది. ప్రముఖ ఓటీటీ వేదికగా ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 4 వారాల్లో డిజిటల్ వేదికగా అందుబాటులోకి రానుంది.

శాకుంతలం
శాకుంతలం

Shakuntalam OTT Release: ఓ పక్క గ్లామర్ చిత్రాలతో లేడి ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటిస్తూ దూసుకెళ్తోంది సమంత(Smanth ruth Prabhu). ఈ ముద్దుగుమ్మ నటించిన శాకుంతలం(Shakuntalam) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీని నీలిమా గుణ నిర్మించారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ(OTT Release) విడుదల గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం శాకుంతలం మూవీ డిజిటల్ ప్రీమియర్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మంచి ఫ్యాన్సీ ధరకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. శాకుంతలం విడుదలైన 4 నుంచి 6 వారాల మధ్య సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో అంతకంటే ముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మే మొదటి వారంలో శాకుంతలం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారం ఈ మూవీని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గుణశేఖర్. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించారు. భరతుడిగా అల్లు అర్హ నటించింది. వీరితో పాటు మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కుమార్తే అల్లు అర్హ ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది. ఈ చిన్నారి పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తున్నారు.

విడుదలకు ముందు భారీ అంచనాలను అందుకున్న శాకుంతలం.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన మేర ఆకట్టుకోలేకపోతుందని టాక్ నడుస్తోంది. 2015 పీరియాడికల్ డ్రామా 'రుద్రమదేవి' తర్వాత.. 7 సంవత్సరాల అనంతరం గుణశేఖర్ తీసిన సినిమా ఇది. సమంత స్టార్ డమ్, గుణశేఖర్ డైరక్షన్ నడుమ భారీ అంచనాలను ఏర్పడ్డాయి.

IPL_Entry_Point