Guardians of the Galaxy Vol. 3 trailer: అద్భుతం.. గార్డియన్స్‌ ఆఫ్‌ ద గెలాక్సీ వాల్యూమ్‌ 3 ట్రైలర్‌-guardians of the galaxy volume 3 trailer out as the netizens call it an epic ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guardians Of The Galaxy Volume 3 Trailer Out As The Netizens Call It An Epic

Guardians of the Galaxy Vol. 3 trailer: అద్భుతం.. గార్డియన్స్‌ ఆఫ్‌ ద గెలాక్సీ వాల్యూమ్‌ 3 ట్రైలర్‌

HT Telugu Desk HT Telugu
Dec 02, 2022 02:31 PM IST

Guardians of the Galaxy Vol. 3 trailer: అద్భుతం.. ఒక్క మాటలో చెప్పాలంటే గార్డియన్స్‌ ఆఫ్‌ ద గెలాక్సీ వాల్యూమ్‌ 3 ట్రైలర్‌ ఓ రేంజ్‌లో ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3 ట్రైలర్ లో ఓ సీన్
గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3 ట్రైలర్ లో ఓ సీన్

Guardians of the Galaxy Vol. 3 trailer: గార్డియన్స్‌ ఆఫ్‌ గెలాక్సీ మళ్లీ వచ్చేశారు. ఈ మూవీ వాల్యూమ్‌ 3 ట్రైలర్‌ శుక్రవారం (డిసెంబర్‌ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ వచ్చే ఏడాది మే 5న రిలీజ్‌ కానుంది. అయితే ఈ ట్రైలర్‌ చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ఓ ఎపిక్‌గా నిలిచిపోతుందని వాళ్లు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ గెలాక్సీ గార్డియన్స్‌ కొత్త వాల్యూమ్‌లో మరో గ్రహానికి వెళ్తారు. అక్కడ మనుషుల్లాగే ఉంటూ జంతువుల ముఖాలతో ఉన్న వాళ్లు వీళ్లకు వెల్‌కమ్‌ చెబుతారు. ఇప్పటి వరకూ వచ్చిన రెండు సినిమాలతో పోలిస్తే ఇదే బెస్ట్‌గా నిలవబోతోందని ఈ ట్రైలర్‌ చూసిన తర్వాత ఓ అభిమాని అన్నారు. "ఈ ట్రైలర్‌ ఎపిక్‌. సినిమా కూడా ఎపిక్‌గా ఉండబోతోంది" అని మరో అభిమాని ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాకు సంబంధించి అన్నీ అద్భుతంగా ఉన్నాయని ఇంకో అభిమాని రాశారు. కామెడీ, ఎమోషన్‌ కలగలసిన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. విన్‌ డీజిల్‌, బ్రాడ్లీ కూపర్‌, సిల్వస్టెర్‌ స్టాలోన్‌ ఈ మూవీలో నటించారు. జేమ్స్‌ గన్‌ ఈ మూవీని డైరెక్ట్‌ చేయగా.. జాన్‌ మర్ఫీ మ్యూజిక్ అందించారు.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.