Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer: సల్మాన్ నోట భగవద్గీత.. కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ ట్రైలర్ వచ్చేసింది
Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer: సల్మాన్ నోట భగవద్గీత విన్నారా? కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ ట్రైలర్ వచ్చేసింది. సల్మాన్ మార్క్ మాస్, యాక్షన ఎంటర్‌టైనర్ గా ఈ మూవీ కనిపిస్తోంది.
Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer: సల్మాన్ ఖాన్ భగవద్గీత శ్లోకం చెబుతూ రావడం ఎప్పుడైనా చూశారా? ధర్మక్షేత్రే.. కురుక్షేత్రే అనే శ్లోకంతో కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ మూవీ ట్రైలర్ లో సల్మాన్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ మచ్ అవేటెడ్ మూవీ ట్రైలర్ సోమవారం (ఏప్రిల్ 10) రిలీజైంది. మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేశారు.
అంతేకాదు సల్మాన్ తో పూజా హెగ్డే లవ్ సీన్స్ కూడా ఈ ట్రైలర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. భాయ్ జాన్ గా గుర్తింపు పొందాలని చూస్తున్న సల్మాన్ ను భాయ్ అని పిలవలేక తెగ ఇబ్బంది పడుతుంది పూజా. ఇక ఈ మూవీలో పూజా అన్నయ్యగా విక్టరీ వెంకటేశ్ కనిపించాడు. వయోలెన్స్ అంటే అస్సలు నచ్చని ఫ్యామిలీ నుంచి వచ్చిన పూజాకు.. వయోలెన్స్ లేనిదే నిద్ర పట్టని సల్మాన్ తో ప్రేమ ఎక్కడికి దారి తీస్తుందన్నది ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఇక ఈ మూవీలో విలన్ గా జగపతి బాబు నటించడం విశేషం. తనదైన మార్క్ విలనిజాన్ని అతడు పండించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. హిందీతోపాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఈ కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో వెంకటేశ్, జగపతి బాబుతోపాటు రామ్ చరణ్ కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనున్నాడు.
ఈ మధ్యే ఏంటమ్మా అంటూ సాగే ఆ పాటను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో లుంగీలు కట్టుకొని సల్మాన్, వెంకటేశ్, రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ వైరల్ అయింది. ఈ మూవీ ట్రైలర్ లో సల్మాన్ సూపర్ లుక్ లో కనిపించాడు. చాలా వరకూ లాంగ్ హెయిర్ తో అసలు సిసలు భాయ్ లాగా అనిపించిన అతడు.. ఓ సీన్ లో మాత్రం ట్రిమ్ చేసి హ్యాండ్సమ్ గా కనిపించాడు.
ఈ ట్రైలర్ లాంచ్ ముంబైలోని మల్టీప్లెక్స్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు సల్మాన్ తోపాటు షెహనాజ్ గిల్, పాలక్ తివారీలాంటి వాళ్లు వచ్చారు. సల్మాన్ కు బెదిరింపులు రావడంతో ఈ ఈవెంట్ కు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ మూవీ రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది.