Saindhav Release Date: సైంధవుడు క్రిస్మస్‌కు వస్తున్నాడు.. వెంకటేశ్, హిట్ డైరెక్టర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్-saindhav release date announced as the venkatesh to come ahead of christmas ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Saindhav Release Date Announced As The Venkatesh To Come Ahead Of Christmas

Saindhav Release Date: సైంధవుడు క్రిస్మస్‌కు వస్తున్నాడు.. వెంకటేశ్, హిట్ డైరెక్టర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Hari Prasad S HT Telugu
Mar 29, 2023 07:53 PM IST

Saindhav Release Date: సైంధవుడు క్రిస్మస్‌కు వస్తున్నాడు. వెంకటేశ్, హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ బుధవారం (మార్చి 29) అనౌన్స్ చేశారు.

సైంధవ్ మూవీలో వెంకటేశ్
సైంధవ్ మూవీలో వెంకటేశ్

Saindhav Release Date: విక్టరీ వెంకటేశ్ నెక్ట్స్ మూవీ సైంధవ్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. హిట్, హిట్ 2 సినిమాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యే ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. వెంకటేశ్ తోపాటు ముఖ్య పాత్రలపై సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

సైంధవ్ మూవీ క్రిస్మస్ కు రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం (మార్చి 29) మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేశ్ చేతిలో గన్ను పట్టుకొని ఓ కంటైనర్ పై కూర్చొని కనిపిస్తున్నాడు. పక్కనే కొన్ని గ్రెనేడ్లు కూడా కనిపిస్తున్నాయి. ఆ కంటైనర్ మొత్తం బాంబులే కనిపిస్తున్నాయి.

దానిపైనే డిసెంబర్ 22న పేలనున్నాయి అంటూ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు. గత మూడు రోజులుగా పలు సినిమాల రిలీజ్ డేట్లను ఆయా మూవీ మేకర్స్ అనౌన్స్ చేస్తుండగా.. చివర్లో తమకు అనుకూలమైన తేదీని ఎంచుకున్నారు. సంక్రాతికి మహేష్ బాబు, ప్రభాస్, కమల్ హాసన్, రామ్ చరణ్ లాంటి వాళ్లు పోటీ పడుతుండటంతో అంతకు ముందు క్రిస్మస్ కే వచ్చేసి కలెక్షన్లు కొల్లగొట్టాలని సైంధవుడు భావిస్తున్నాడు.

క్రిస్మస్ హాలీడేస్, లాంగ్ వీకెండ్ ను సొమ్ము చేసుకునే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ తేదీని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సైంధవ్ మూవీ ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ కానుంది. హిట్ ఫ్రాంఛైజీతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న శైలేష్ కొలను ఇప్పుడు వెంకటేశ్ తో ఏం చేయబోతున్నాడో చూడాలి. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో వెంకట్ బోయనపల్లి ఈ సినిమా నిర్మిస్తున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.