Venkatesh Saindhav Movie: హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో వెంకీ మామ.. 'సైంధవ్'గా లుక్ అదిరిందిగా..!
Venkatesh Saindhav Movie: విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని హిట్ 2 డైరెక్టర్ సైలేష్ కొలను దర్శకత్వంలో చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది.
Venkatesh Saindhav Movie: టాలీవుడ్ స్టార్ వెంకటేష్(Venkatesh) గతేడాది ఎఫ్3 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన నటించబోయే సినిమా గురించి ఆసక్తి నెలకొంది. అయితే ఇంతవరకు వెంకీ మామ తన తదుపరి ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇటీవలే హిట్ 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రాగా.. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టైటిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
హిట్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న సైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ చేయబోయే సినిమాకు సైంధవ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. చేతిలో గన్ పట్టుకుని మాస్ లుక్, గుబురు గడ్డంతో వెంకటేష్ అదరగొట్టారు. ఇంతవరకు వెంకీని చూడని పాత్రలో చూడబోతున్నట్లు ఈ పోస్టర్‌ను చూస్తుంటేనే తెలుస్తోంది. వెంకీ లుక్‌తో అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ గ్లింప్స్ వీడియోలో విక్టరీ వెంకటేష్ కంటైనర్లు ఉన్న ఓ ప్రదేశంలో చేతిలో ఓ బయో డ్రగ్‌ను పట్టుకుని కనిపించారు. అనంతరం దీంతో దాడి చేసేందుకు కంటైనర్‌లోని గన్‌ను వెతికి తీసుకొచ్చారు. "నేను ఇక్కడ ఉంటాను రా.. ఎక్కడికి వెళ్లను రమ్మను" అనే డైలాగ్‌తో అదరగొట్టారు.
నిహారిక ఎంటర్టైన్ మెంట్(Niharika Entertainment)పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వెంకటేష్ నటించబోయే 75వ సినిమా కావడం గమనార్హం. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాకు సైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇది రానుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
సంబంధిత కథనం