Venkatesh | వెంకటేష్‌తో జాతిరత్నాలు డైరెక్టర్.. ఇక నవ్వులే నవ్వులు..!-victory venkatesh nex movie with jathiranalu director anudeep ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Victory Venkatesh Nex Movie With Jathiranalu Director Anudeep

Venkatesh | వెంకటేష్‌తో జాతిరత్నాలు డైరెక్టర్.. ఇక నవ్వులే నవ్వులు..!

HT Telugu Desk HT Telugu
Mar 19, 2022 06:15 PM IST

విక్టరీ వెంకటేష్ తన తర్వాతి చిత్రాన్ని జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో నటించనున్నాడట. ఆ దర్శకుడు చెప్పిన కథకు వెంకీకి నచ్చడంచో సినిమాకు ఓకే చెప్పాడని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

జాతిరత్నాలు డైరెక్టర్ ‌తో వెంకటేష్
జాతిరత్నాలు డైరెక్టర్ ‌తో వెంకటేష్ (Twitter)

జాతిరత్నాలు సినిమాతో ఓ రేంజ్‌లో హిట్ కొట్టాడు దర్శకుడు అనుదీప్. చేసింది రెండో సినిమా అయినా గతేడాది విడుదల చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ బ్లాక్‌బాస్టర్ తర్వాత ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడో అని అంతా ఆత్రుతగా ఎదురుచూశారు. అయితే అందరికీ షాకిస్తూ తమిళ నటుడు శివకార్తీకేయన్‌తో ప్రాజెక్టును పక్కాలెక్కించాడు. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోతో పనిచేయబోతున్నాడట యువ దర్శకుడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. విక్టరీ వెంకటేష్‌తో జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ కలిసి పనిచేయబోతున్నాడట.

అయితే ఇందుకు వెంకీ కూడా అతడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కొన్ని రోజుల ముందే వెంకటేష్‌ను కలిసిన అనుదీప్ ఓ కథను చెప్పారట. ఆయనకు స్టోరీ నచ్చేయడంతో సినిమాకు ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం అనుదీప్ తెలుగు, తమిళ భాషల్లో శివకార్తికేయన్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే.. వెంకీతో చిత్రం పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట.

కామెడీ టైమింగ్‌లో వెంకీని కొట్టేవారే లేదు. దీంతో జాతిరత్నాలు లాంటి ఫుల్ హాస్యాస్పద చిత్రాన్ని తెరకెక్కించిన అనుదీప్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నాడనే టాక్ రావడంతో వెంకీ అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

గతేడాది విక్టరీ వెంకటేష్ హీరోగా రెండు సినిమాల్లో నటించారు. అందులో నారప్ప ఒకటి. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ అసురన్‌ రీమేక్‌గా తెరకెక్కింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. దీని తర్వాత వచ్చిన దృశ్యం-2 కూడా ఓటీటీలోనే విడుదలై ప్రేక్షకాదరణ పెరిగింది. దీంతో వెంకీని థియేటర్లలో ఎప్పుడూ చూద్దామా అని ప్రేక్షకులకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మే 27న ఎఫ్3 మూవీ రూపంలో వారి కోరిక నెరవేరనుంది.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్