Serial killer : రైళ్లు, రైల్వే స్టేషన్లలో వారే ఈ సీరియల్​ కిల్లర్​ టార్గెట్స్​​! ఐదుగురిని చంపి..-2000 cctv footage 6 state probe how man who killed 5 in a month was caught ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Serial Killer : రైళ్లు, రైల్వే స్టేషన్లలో వారే ఈ సీరియల్​ కిల్లర్​ టార్గెట్స్​​! ఐదుగురిని చంపి..

Serial killer : రైళ్లు, రైల్వే స్టేషన్లలో వారే ఈ సీరియల్​ కిల్లర్​ టార్గెట్స్​​! ఐదుగురిని చంపి..

Sharath Chitturi HT Telugu
Nov 29, 2024 11:15 AM IST

Gujarat Serial killer : ఐదుగురిని చంపిన రాహుల్ కరమ్​వీర్ జాట్ అనే సీరియల్​ కిల్లర్​ని పట్టుకునేందుకు 6 రాష్ట్రాల్లో ఆపరేషన్స్​ జరిగాయి! 2వేలకుపైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. చివరికి అతను దొరికాడు!

సీసీటీవీ కెమెరాకు చిక్కిన సీరియల్​ కిల్లర్​ ఫొటో..
సీసీటీవీ కెమెరాకు చిక్కిన సీరియల్​ కిల్లర్​ ఫొటో..

గుజరాత్ లో 19 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య కేసులో రాహుల్ కరమ్​వీర్ జాట్ అనే వ్యక్తిని ఇటీవల అరెస్టు చేశారు. అతనొక సీరియల్​ కిల్లర్​ అని, అప్పటికే ఐదుగురిని చంపాడని పోలీసులు దర్యాప్తులో తేలింది!

కేవలం నెల రోజుల్లోనే పలు రాష్ట్రాల్లో రైళ్లలో జరిగిన నాలుగు హత్యలతో పాటు ఇతర నేరాలతో నిందితుడికి సంబంధం ఉందని గుజరాత్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

6 రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన సంయుక్త పోలీసు దర్యాప్తు, గుజరాత్​లోని పలు జిల్లాల్లోని దాదాపు 2,000 సీసీ కెమెరాల విశ్లేషణ తర్వాత రాహుల్ కరమ్​వీర్ జాట్​ని నవంబర్ 24న గుజరాత్​ వల్సాద్​లోని వాపి రైల్వే స్టేషన్​లో అరెస్టు చేశారు.

సీరియల్ కిల్లర్​ని గుజరాత్​లో ఎలా పట్టుకున్నారు?

హరియాణాకు చెందిన 30ఏళ్ల నిందితుడిని నవంబర్ 24న భారీ ఆపరేషన్ అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీరియల్ కిల్లర్ బాంద్రా-భుజ్ రైలులో ప్రయాణిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడని వల్సాద్ పోలీసు సూపరింటెండెంట్ కరణ్రాజ్ వాఘేలా తెలిపారు.

వల్సాద్ జిల్లాలోని ఉద్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో నవంబర్ 14న 19 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని హత్య చేసి అత్యాచారం చేసిన కేసులో కీలక ఆధారాలు లభించాయి.

2000 సీసీటీవీ ఫుటేజీల పరిశీలన..

ఫోరెన్సిక్ పరీక్షలో మృతురాలిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిన వెంటనే పోలీసులు పలు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి 2 వేలకు పైగా సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.

యువతి మృతదేహం లభ్యమైన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న కొన్ని దుస్తులనే ధరించి రైల్వేస్టేషన్​లోని సీసీటీవీ కెమెరాల్లో నిందితుడు కనిపించాడు. అయితే నిందితుడు కుంటకుంటూ వెళ్లడాన్ని పోలీసులు గమనించారు. అది కేసులో కీలకంగా మారింది.

దారుణమైన నేరానికి పాల్పడిన తర్వాత రైల్వే స్టేషన్​లో ఆహారాన్ని ఆస్వాదిస్తున్న జాట దృశ్యాలు సీసీటీవీ కెమెరా ఫుటేజీలో రికార్డయ్యాయి.

అతడిని పట్టుకునేందుకు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో అతను చేసిన వరుస హత్యలు విచారణలో వెలుగు చూశాయి.

సీరియల్ కిల్లర్ రాహుల్ కరమ్​ వీర్ జాట్ ఎవరు?

రాహుల్ కరమ్​వీర్ జాట్ 5వ తరగతి డ్రాపౌట్ అని మీడియా కథనాలు సూచించాయి. ఈ సీరియల్​ కిల్లర్​, చేసిన నేరాలను అంగీకరించినట్టు సమాచారం.

వల్సాద్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 25న బెంగళూరు-ముర్దేశ్వర్ రైలులో కర్ణాటకలో తోటి ప్రయాణికుడిని నిందితుడు హత్య చేశారు. పశ్చిమ బెంగాల్లో నవంబర్ 19న కతిహార్ ఎక్స్​ప్రెస్​లో 63 ఏళ్ల వ్యక్తిని చంపాడు.

కొన్ని రోజుల ముందు నవంబర్ 24 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మంగళూరు స్పెషల్ ఎక్స్​ప్రెస్​లో ఒక మహిళను హత్య చేశాడు జాట్​.

2024 అక్టోబర్​లో పూణె-కన్యాకుమారి రైలులో షోలాపూర్ సమీపంలో మహిళా ప్రయాణికురాలిపై లైంగిక దాడి చేసి హత్య చేశాడని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వాఘేలా తెలిపారు.

ముఖ్యంగా వికలాంగుల బోగీలు, మహిళా కంపార్ట్​మెంట్లలో ఒంటరి ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని నిందితుడు ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం