Nissan Patrol SUV : సల్మాన్ ఖాన్ 'రక్షణ'కు వాడుతున్న సూపర్ ఎస్యూవీ ఇదే..!
Nissan Patrol SUV : సల్మాన్ ఖాన్ ఇటీవలే నిస్సాన్ పాట్రోల్ ఎస్యూవీ తీసుకున్నారు. బులెట్‌ప్రూఫ్ వాహనం కోసం చూస్తున్న వారికి.. ఇదే ది బెస్ట్ అని మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి.
Nissan Patrol SUV bulletproof price : బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఇటీవలి కాలంలో బెదిరింపులు పెరిగిపోయాయి. ఆయన్ని చంపేస్తామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్‌కు భద్రతను అధికారులు మరింత పెంచారు. దీనితో పాటు సల్మాన్ ఖాన్.. తన భద్రత కోసం ఓ కొత్త వాహనాన్ని తీసుకున్నారు. అదే.. నిస్సాన్ పాట్రోల్ ఎస్యూవీ. ఇదొక లగ్జరీ, బులెట్‌ప్రూఫ్ ఎస్యూవీ.
ఏడాదిలోనే కొత్త వాహనం..
ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్.. ఇటీవలే ఓపెన్ అయ్యింది. ఇందుకోసం ఓ గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు.. కొత్తగా కొన్న బులెట్‌ప్రూఫ్ నిస్సాన్ పాట్రోల్ ఎస్‌యూవీలో వెళ్లారు సల్మాన్ ఖాన్. పర్సనల్ సెక్యూరిటీతో పాటు పోలీస్ భద్రత కూడా ఆయనకు లభించింది.
Salman Khan Nissan Patrol SUV : నిస్సాన్ పాట్రోల్ కన్నా ముందు.. టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్సీ200ను వినియోగించేవారు సల్మాన్ ఖాన్. అయితే.. పాట్రోల్ ఎస్యూవీ మోడల్‌ను నిస్సాన్ ఇండియాలో విక్రయించడం లేదు. దీని బట్టి.. ఈ మోడల్‌ను సల్మాన్ ఖాన్ దిగుమతి చేసుకున్నట్టు అర్థమవుతోంది. దక్షిణాసియా ప్రాంతాల్లో ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఉంది. బులెట్‌ప్రూఫ్ వాహనం తీసుకోవాలని భావిస్తున్న వారందరికి ఈ ఎస్యూవీనే బెస్ట్ ఛాయిస్ అని మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి.
నిస్సాన్ పాట్రోల్ ఎస్యూవీ- ఇంజిన్..
సల్మాన్ ఖాన్ తీసుకున్న ఈ నిస్సాన్ పాట్రోల్ ఎస్‌యూవీలో 5.6 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 400 బీహెచ్పీ పవర్‌ను, 560 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 7 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ సైతం ఉంటుంది. 4 వల్ డ్రైవ్ సిస్టెమ్ దీని సొంతం. ఈ ఎస్యూవీ ఓ ఆఫ్ రోడర్! టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్సీ300, ల్యాండ్ రోవర్ డిఫెండర్లకు గట్టిపోటీస్తోంది.
Salman Khan new car cost : నిస్సాన్ పాట్రోల్ 6వ జనరేషన్ మోడల్‌ను తీసుకున్నారు ఈ బాలీవుడ్ హీరో. సాధారణంగా.. నాన్ బులెట్‌ప్రూఫ్ మోడల్ ధరే రూ. 2కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది.. సల్మాన్ ఖాన్ తీసుకున్న బులెట్‌ప్రూఫ్ నిస్సాన్ పాట్రోల్ ధర రూ. 2కోట్ల కన్నా ఎక్కువగానే ఉంటుంది.
2022 ముందు వరకు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యూబీని ఉపయోగించేవారు బాలీవుడ్ నటుడు. 2022లో ల్యాండ్ క్రూజర్ ఎల్సీ200కి షిఫ్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు బులెట్‌ప్రూఫ్ నిస్సాన్ పాట్రోల్ ఎస్‌యూవీని తీసుకున్నారు.
బెదిరింపులు ఎవరి నుంచి?
Salman Khan Nissan Patrol SUV bulletproof : పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లాసెన్స్ బిష్ణోయ్, అతని సహచరుల నుంచి గత కొంత కాలంగా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు సల్మాన్ ఖాన్. 1998లో కృష్ణ జింకలను సల్మాన్‌ఖాన్ వేటాడినట్టు ఓ కేసు ఉంది. బిష్ణోయ్.. ఈ కృష్ణ జింకలను అత్యంత పవిత్రంగా భావించే తెగకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. అందుకే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని అతను బెదిరిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు.
సంబంధిత కథనం