Bhagavad Gita Message । యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలి.. భగవద్గీత!
Bhagavad Gita Message: శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ముఖ్య సందేశాలు ఇస్తాడు. భగవద్గీత రూపంలో మనకు పరమాత్ముని బోధనలు అందుబాటులో ఉన్నాయి. జీవితానికి ఉపయోగపడే ఆ సందేశాలు ఇక్కడ తెలుసుకోండి.
మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసేటపుడు అర్జునుడికి జ్ఞాననేత్రం ప్రసాదిస్తాడు. ఆ ఒక్క క్షణంలో అర్జునుడికి సమస్త విశ్వమంతా శ్రీ కృష్ణుడిలా కనిపిస్తుంది. ధర్మం, మోక్షం, పునర్జన్మల గురించి భగవద్గీత వివరిస్తుంది.
ఒకరి అస్తిత్వం విశ్వంలోని ఎనిమిది మూలకాలతో రూపొందించబడింది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, తెలివి, స్పృహ. మానవ ఉనికిని కప్పి ఉంచే ఐదు పొరలు పర్యావరణం, భౌతిక శరీరం, ఆత్మ, మనస్సు, జ్ఞానం. దీనిని బట్టి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి అస్తిత్వం విశ్వంలో అంతర్భాగమే. అందుకే మరణం అనేది శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఏ ఒక్కరైనా శరీరాన్ని చంపగలరు కానీ ఆత్మను చంపలేరు అని భగవద్గీత తెలియజేస్తుంది.
Bhagavad Gita Message- భగవద్గీత సందేశాలు
శ్రీకృష్ణుడు భగవద్గీతలో ముఖ్యమైన సందేశాలను అందించాడు. ఆ సందేశాలు సమస్త మానవాళిని ధర్మ మార్గంలో నడిపించేదుకు సహాయపడతాయి. వాటిని పాటించడం ద్వారా ఆదర్శవంతమైన జీవితాన్ని పొందవచ్చు. గీతలోని సందేశాలు కొన్ని ఇక్కడ చూడండి.
ప్రశాంతంగా ఉండాలి
తీవ్రమైన ఆలోచనలు, భావోద్వేగాలతో యుద్ధం చేస్తున్న అర్జునుడికి మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు ఆడుగుతాడు. శ్రీకృష్ణుడు మాట్లడుతూ యుద్ధం కూడా అంత:కరణ శుద్ధితో చేయాలి, ప్రశాంతంగా చేయాలి. ధ్వేషంతో పోరాటం చేయకూడదు. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాటం చేయాలి. సమానత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాలి. యుద్ధం గెలవాలంటే ముందు మనసును జయించాలి. మనసులో ఆందోళన లేనపుడు, శాంతిని పొందవచ్చు. ఈ స్థితిని అనుభవించిన వ్యక్తి, జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతాడని బోధిస్తాడు.
మనస్సుపై విజయం
మనస్సుపై విజయం మీ బంధనానికి, విముక్తికి బాధ్యత వహిస్తుంది. మనస్సు నిరంతరం మారుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన ద్వారా శిక్షణ పొందినట్లయితే, అది మీ స్నేహితుడు, మీకు సహాయం చేస్తుంది, లేకపోతే మీ స్వంత మనస్సు శత్రువులా ప్రవర్తిస్తుంది. అని గీత చెబుతుంది.
కర్మ ఫలాలను ఆశించవద్దు
కర్మల ఫలాలను ఆశించకుండా కర్మలు చేయమని అర్జునుడికి కృష్ణుడు బోధిస్తాడు. ప్రకృతి నియమం ప్రకారం సమర్ధవంతంగా వ్యవహరించమని చెబుతాడు. నిస్వార్థ క్రియ ద్వారా మోక్షం లభిస్తుంది. అంటే ఫలితంతో ఎటువంటి సంబంధం లేకుండా వృత్తి ధర్మాన్ని నిస్వార్థంగా నిర్వర్తిస్తే మోక్షం లభిస్తుందని ఇక్కడ అర్థం.
మీ ప్రతిచర్యనే మీ వ్యక్తిత్వం
'నువ్వు పిరికివాడివి, యుద్దభూమి నుండి పారిపోవాలనుకునేవాడివి' అని శ్రీకృష్ణుడు మొదట అర్జునుడిని బాధపెట్టాడు. కానీ అర్జునుడు ప్రతిగా కృష్ణుడితో వైరం పెట్టుకోలేదు, బాధపడలేదు. దీని అర్థం ప్రతీ విషయానికి బాధపడకూడదు అని తెలియజెప్పటం.
మీకు బాధగా అనిపించినప్పుడు, దానిలో మునిగిపోకండి. పరిస్థితిని పరిగణించండి. మీరు ఎంతో గౌరవించే వ్యక్తి , తెలివైన వ్యక్తి చర్యలు మిమ్మల్ని బాధపెడితే, అది మంచి కారణం కోసమే అని గ్రహించాలి. మీకు సమానమైన వ్యక్తి బాధపెడితే అది కర్మ, అజ్ఞాని బాధపడితే వారిపై కరుణ చూపండి. ఈ మూడు వైఖరులు మీ మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి.
కాల ప్రవాహానికి సాక్షిగా ఉండాలి
జరిగేవేవి జరగక మానవు. ఏది జరగాల్సి ఉంటుందో అది తప్పక జరిగితీరుతుంది. జీవితంలో జరిగే మంచి, చెడులను ఒకే విధంగా చూడాలి. మీ జీవితంలో జరిగే సంఘటనల ప్రవాహాన్ని చూసే ప్రత్యక్ష సాక్షిగా మీరే ఉండాలని గీత తెలుపుతుంది. ప్రతి సంఘటన ఒక అనుభవం, ఒక పాఠం నేర్పుతుందని గీతలో ఉంది. అలా సాక్షిగా ఉన్నవారే నిర్భయంగా పరిస్థితులను ఎదుర్కోగలరు. గాలి వచ్చి వెళ్లిపోయినట్లు జీవితంలో సుఖదుఖాలు వస్తాయి, పోతాయి. అక్కడే చిక్కుకోకుండా ముందుకు సాగండి, మీ ప్రయత్నాలలో ఉండండి. మీకు దక్కాల్సినది దక్కుతుంది.
సంబంధిత కథనం
టాపిక్