తెలుగు న్యూస్  /  Business  /  Zomato Asks Employees To Leave In Company-wide Layoffs

Zomato layoffs 2022 : జొమాటోలో ఉద్యోగాల కోత.. ఆ 3శాతం మంది ఇంటికి!

20 November 2022, 6:48 IST

    • Zomato layoffs 2022 : సంస్థలోని 3శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది జొమాటో. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
జొమాటోలో ఉద్యోగాల కోత.. ఆ 3శాతం మంది ఇంటికి!
జొమాటోలో ఉద్యోగాల కోత.. ఆ 3శాతం మంది ఇంటికి!

జొమాటోలో ఉద్యోగాల కోత.. ఆ 3శాతం మంది ఇంటికి!

Zomato layoffs 2022 : జొమాటోకు సైతం 'ఉద్యోగాల కోత' సెగ తగలింది! సంస్థలోని టెక్నాలజీ, ప్రాడక్ట్​, మార్కెటింగ్​తో పాటు ఇతర విభాగల నుంచి ఉద్యోగులను తొలగించేందుకు ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో నిర్ణయించుకుంది.

"ఉద్యోగుల ప్రదర్శన ఆధారంగా ఇది నిత్యం జరిగే ప్రక్రియే. ఈసారి 3శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నాము. దీనికి మించి ఏం లేదు," అని జొమాటో సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

జొమాటోలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పూర్తైనట్టు తెలుస్తోంది. తాజా ఉద్యోగాల కోత కన్నా ముందు.. సంస్థలో 3,800 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్క 2022లోనే జొమాటోలో పని చేసిన 17వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు! సంస్థను లాభాల బాట పట్టించాలని జొమాటో యంత్రాంగం నిర్ణయం తీసుకోవడంతో.. కాస్ట్​ కటింగ్​ పేరుతో జాబ్స్​ ఊడిపోతున్నాయి. చివరిసారిగా.. కొవిడ్​ సంక్షోభం నేపథ్యంలో 2020 మే నెలలో.. 13శాతం(520మంది) ఉద్యోగులను తొలగించింది ఈ ఫుడ్​ డెలివరీ సంస్థ.

రాజీనామాల పర్వం..!

Zomato layoffs news : మరోవైపు.. జొమాటో కో ఫౌండర్​ మోహిత్​ గుప్తా.. సంస్థకు శుక్రవారం గుడ్​ బై చెప్పారు. సంస్థలో ఇన్​వెస్టర్​గా కొనసాగుతానని వెల్లడించారు. 2018లో సంస్థలో చేరిన గుప్తా.. ఫుడ్​ డెలివరీ యూనిట్​ని తన భుజాలపై వేసుకుని నడిపించారు. 2020లో.. ఆయనకు కో ఫౌండర్​ స్థానాన్ని ఇచ్చింది ఈ సంస్థ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

గుప్తా కన్నా ముందు.. ఇనీషియెటివ్​ హెడ్​ రాహుల్​ గంజూ, ఇంటర్​సిటీ లెజెండ్స్​ సర్వీస్​ హెడ్​ సిద్ధార్థ జావర్​ కూడా.. జొమాటో నుంచి ఇటీవలే తప్పుకున్నారు. మరో కో ఫౌండర్​ గౌరవ్​ గుప్తా.. గతేడాది సంస్థ నుంచి వెళ్లిపోయారు.

తగ్గిన జొమాటో నష్టాలు..

2023 ఆర్థిక ఏడాది క్యూ2 ఫలితాలను ఇటీవలే ప్రకటించింది జొమాటో. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే.. జొమాటో నష్టాలు ఈసారి మరింత తగ్గాయి. సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో జొమాటో నెట్​ లాస్​ రూ. 251కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో అది రూ. 430కోట్లుగా ఉండేది. ఇక కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం 62శాతం పెరిగి రూ. 1,661కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 1,024కోట్లుగా ఉండేది.

Zomato Q2 results 2022 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జొమాటో షేర్లు..

Zomato shar price : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సరికి జొమాటో షేరు ధర రూ. 67.20గా ఉంది. గత ఐదు ట్రేడింగ్​ సెషన్లలో జొమాటో స్టాక్​ ప్రైజ్​ 3.79శాతం పడింది. నెల రోజుల్లో మాత్రం 9.62శాతం పెరిగింది. ఇక ఆరు నెలల్లో.. జొమాటో షేరు ధర 15.6శాతం వృద్ధిచెందింది. కానీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. జొమాటో స్టాక్​ ప్రైజ్​ 52.6శాతం మేర పడిపోయింది.

టాపిక్