Zomato Q2 results : క్యూ2లో.. మరింత తగ్గిన జొమాటో నష్టాలు- పెరిగిన ఆదాయం-zomato announced q2 results net loss narrows to 251 cr revenue up by 62 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Q2 Results : క్యూ2లో.. మరింత తగ్గిన జొమాటో నష్టాలు- పెరిగిన ఆదాయం

Zomato Q2 results : క్యూ2లో.. మరింత తగ్గిన జొమాటో నష్టాలు- పెరిగిన ఆదాయం

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 11, 2022 07:14 AM IST

Zomato Q2 results 2022 : జొమాటో సంస్థ నష్టాలను క్రమంగా తగ్గించుకుంటోంది. క్యూ2 ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత తగ్గిన జొమాటో నష్టాలు
మరింత తగ్గిన జొమాటో నష్టాలు

Zomato Q2 results 2022 : ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో.. 2023 ఆర్థిక ఏడాది క్యూ2 ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే.. జొమాటో నష్టాలు ఈసారి మరింత తగ్గాయి. సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో జొమాటో నెట్​ లాస్​ రూ. 251కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో అది రూ. 430కోట్లుగా ఉండేది. ఇక కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం 62శాతం పెరిగి రూ. 1,661కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 1,024కోట్లుగా ఉండేది.

బ్లింకిట్​ను జొమాటో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఒప్పందం ఆగస్టులో పూర్తైంది. ఫలితంగా.. బ్లింకిట్​కు చెందిన 50రోజుల ఆర్థిక వ్యవహారాలను కూడా జొమాటో పోస్ట్​ చేసింది.

Zomato Q2 results : ఫుడ్​ డెలివరీ బిజినెస్​తో పాటు హైపర్​ప్యూర్​ యూనిట్​ నుంచి వచ్చే ఆదాయం పెరగడంతో.. జొమాటో నష్టాలు తగ్గాయి.

"మా ఫుడ్​ బిజినెస్​ నిత్యం వృద్ధిచెందుతూ ప్రాఫిట్​వైపు దూసుకెళుతోంది. ప్రస్తుతం ఉన్న దాని కన్నా మా ఫుడ్​ బిజినెస్​ మరింత వేగంగా వృద్ధిచెందే అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను," అని షేర్​హోల్డర్లకు రాసిన లేఖలో జొమాటో సీఎఫ్​ఓ అక్షత్​ గోయల్​ తెలిపారు.

జొమాటో అడ్జస్టెడ్​ ఎబిట్​డా రూ. 192కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 310కోట్లుగా ఉండేది. ఫుడ్​ డెలివరీ ఆపరేషన్స్​ నుంచి వచ్చే అడ్జస్టెడ్​ రెవెన్యూ కూడా 27శాతం పెరిగి రూ. 1,581కోట్లుగా నమోదైంది. గతేడాది ఇది రూ. 1,248కోట్లుగా ఉండేది. యావరేజ్​ మంత్లీ ట్రాన్స్​క్షన్ యూజర్లు 17.5మిలియన్​లకు చేరారు. గతేడాది ఇదే త్రైమాసికంలో అది 15.5 మిలియన్​లుగా ఉండేది.

అయితే.. ఈ త్రైమాసికంలో యాక్టివ్​ రెస్టారెంట్​ పార్టన్​నర్స్​ యావరేజ్​ తగ్గింది. జూన్​ త్రైమాసికంలో ఈ సంఖ్య 2,08,000గా ఉండగా ఇప్పుడది 2,07,000కి చేరింది. కానీ గతేడాది ఇదే త్రైమాసికంలో అది 1,70,000గా ఉంది.

Zomato quarterly results : జొమాటో బీ టు బీ(బిజినెస్​ టు బిజినెస్​) హైపర్​ప్యూర్​.. అడ్జస్టెడ్​ రెవెన్యూ మూడు రెట్లు పెరగడం విశేషం. సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో అది రూ. 334కోట్లుగా నమోదైంది. అడ్జస్టెడ్​ ఎబిట్​డా లాస్​ రూ. 53కోట్లకు పెరిగింది.

ఇక బ్లింకిట్​ గ్రాస్​ ఆర్డర్​ వాల్యూ.. గత త్రైమాసికంతో పోల్చుకుంటే ఈసారి 26శాతం వృద్ధి చెంది. రూ. 1,482కోట్లుగా నమోదైంది. అడ్జస్టెడ్​ రెవెన్యూ 44శాతం పెరిగి రూ. 236కోట్లకు చేరింది. ఎడ్జస్టెడ్​ ఎబిట్​డా లాస్​ రూ. 259కోట్లుగా ఉంది.

జొమాటో ప్రోను సంస్థ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఫలితంగా జొమాటో ప్రో నుంచి వచ్చే ఆదాయం రూ. 9లక్షలకు పడిపోయింది.

జొమాటో షేర్​ ప్రైజ్​..

Zomato share price : గురువారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సరికి జొమాటో షేరు ధర రూ. 63.65గా ఉంది. గత ఐదు ట్రేడింగ్​ సెషన్లలో జొమాటో స్టాక్​ ప్రైజ్​ 2.09శాతం పెరిగింది. నెల రోజుల్లో మాత్రం 2.90శాతం పతనమైంది. ఇక ఆరు నెలల్లో.. జొమాటో షేరు ధర 17.44శాతం వృద్ధిచెందింది. కానీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. జొమాటో స్టాక్​ ప్రైజ్​ 54.97శాతం మేర పడిపోయింది.

Whats_app_banner

సంబంధిత కథనం