Swiggy, Zomato: టాప్ 10 ఫుడ్ డెలివరీ కంపెనీల జాబితాలో స్విగ్గీ, జొమాటో-indias swiggy zomato amongst top 10 global food delivery platforms ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Swiggy, Zomato: టాప్ 10 ఫుడ్ డెలివరీ కంపెనీల జాబితాలో స్విగ్గీ, జొమాటో

Swiggy, Zomato: టాప్ 10 ఫుడ్ డెలివరీ కంపెనీల జాబితాలో స్విగ్గీ, జొమాటో

HT Telugu Desk HT Telugu
Sep 22, 2022 12:55 PM IST

world's top 10 e-commerce-based food delivery companies: టాప్ 10 ఫుడ్ డెలివరీ కంపెనీల జాబితాలో స్విగ్గీ, జొమాటో నిలిచాయి.

<p>టాప్ 10 ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల జాబితాలో నిలిచిన జొమాటో, స్విగ్గీ</p>
టాప్ 10 ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల జాబితాలో నిలిచిన జొమాటో, స్విగ్గీ (HT_PRINT)

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: భారతీయ ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లు స్విగ్గీ, జొమాటో ప్రపంచంలోని 'టాప్ 10' ఇ-కామర్స్ ఆధారిత ఫుడ్ డెలివరీ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

కెనడా ప్రధాన కేంద్రంగా ఉన్న గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఈటీసీ గ్రూప్ 'ఫుడ్ బారన్స్ 2022 - క్రైసిస్ ప్రాఫిటీరింగ్, డిజిటలైజేషన్ అండ్ షిఫ్టింగ్ పవర్' పేరుతో ప్రచురించిన నివేదికలో స్విగ్గీ, జొమాటో వరుసగా 9వ, 10వ స్థానంలో నిలిచాయి.

అవి రెండూ 100 కంటే ఎక్కువగా ఉన్న భారతీయ యునికార్న్‌ కంపెనీల్లో భాగం కావడం విశేషం. 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన కంపెనీలను యూనికార్న్ అంటారు.

చైనాకు చెందిన ఆహార ప్లాట్‌ఫారమ్ మెయితువాన్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. యూకేకి చెందిన డెలివెరూ, యూఎస్‌కు చెందిన ఉబెర్ ఈట్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

‘ఫుడ్ డెలివరీ రంగం వేగంగా ఏకీకృతం అవుతోంది. కానీ కంపెనీలు ప్రాంతీయ ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నందున పోటీదారుల వాటాలను కొనుగోలు చేయడం, విక్రయించడం, మార్పిడి చేయడం వంటివి చేస్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది.

లాభదాయకత వైపు వెళ్లేందుకు వ్యాపార నమూనాను మార్చడం, కిరాణా, ఫార్మసీ డెలివరీని జోడిస్తున్నాయని వివరించింది. గిగ్ ఎకానమీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా నివేదిక దృష్టి సారించింది.

‘న్యూయార్క్ నగరం ఆహార పంపిణీ రంగాన్ని నియంత్రించడానికి, కనీస వేతనం, ఇతర సంక్షేమ చర్యలు ఏర్పాటు చేయడానికి చట్టాన్ని ఆమోదించిన మొదటి నగరంగా మారింది..’ అని పరిశోధన నివేదిక వివరించింది.

Whats_app_banner

టాపిక్