తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Zomato Delivery Agent Viral Video: వైరల్‌గా మారిన జొమాటో డెలివరీ ఏజెంట్ వీడియో

Zomato delivery agent viral video: వైరల్‌గా మారిన జొమాటో డెలివరీ ఏజెంట్ వీడియో

23 August 2022, 16:45 IST

zomato delivery agent viral video: జొమాటో డెలివరీ పార్టనర్‌గా పనిచేస్తున్న వ్యక్తి వీడియో ఆన్‌లైన్‌లో హృదయాలను కదిలిస్తోంది. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ తాను పనికి వెళుతూ పిల్లలను ఎలా తీసుకువెళతాడో ఈ చిన్న క్లిప్ చూపిస్తుంది. డెలివరీ పార్టనర్ తన చిన్న కూతురు, కొడుకుతో కలిసి తన డెలివరీ వర్క్ చేస్తున్నప్పుడు ఈ వీడియో చిత్రీకరించారు. వీడియోను ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. షేర్ చేసినప్పటి నుండి మిలియన్ వ్యూస్‌తో వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా యూజర్లు కామెంట్లతో ముంచెత్తారు. జొమాటో కూడా వీడియోకు ప్రత్యుత్తరం ఇచ్చింది. డెలివరీ ఏజెంట్ కాంటాక్ట్ వివరాలను తెలుసుకుని పిల్లల సంరక్షణ సౌకర్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.