తెలుగు న్యూస్  /  Business  /  Zomato Co-founder Mohit Gupta Resigns

Zomato co-founder Mohit Gupta resigns: జొమాటోకు రాజీనామా చేసిన కో ఫౌండర్

HT Telugu Desk HT Telugu

18 November 2022, 21:55 IST

  • ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో(Zomato)కు మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. సంస్థ కో ఫౌండర్ గా ఉన్న మోహిత్ గుప్తా రాజీనామా చేశారు.

జొమాటో కో ఫౌండర్ మోహిత్ గుప్తా
జొమాటో కో ఫౌండర్ మోహిత్ గుప్తా (Twitter)

జొమాటో కో ఫౌండర్ మోహిత్ గుప్తా

Zomato co-founder Mohit Gupta resigns: కో ఫౌండర్ మోహిత్ గుప్తా రాజీనామాతో ఒకే నెలలో జోమాటో నుంచి ముగ్గురు సీనియర్లు వెళ్లిపోయినట్లైంది.

3rd Senior leaving Zomato: నాలుగేళ్ల పాటు సేవలు..

జొమాటో లో నాలుగున్నర సంవత్సరాల పాటు గుప్తా సేవలను అందించారు. 2018లో సంస్థలో చేరిన గుప్తా మొదట జొమాటో ఫుడ్ డెలివరీ యూనిట్ కు నేతృత్వం వహించారు. 2020లో సంస్థ ఆయనను కో ఫౌండర్ గా ఎలివేట్ చేసింది. ఈ నెలలోనే న్యూ ఇనీషియేటివ్ హెడ్ రాహుల్ గాంజూ, ఇంటర్ సిటీ లెజెండ్స్ సర్వీస్ సిద్ధార్థ్ ఝావర్ లు జొమాటోకు రాజీనామా చేశారు. సంస్థ మరో కో ఫౌండర్ గౌరవ్ గుప్తా జొమాటో ఐపీఓ కు వెళ్లిన రెండు నెలల తరువాత రాజీనామా చేశారు.

Zomato CEO comments: మీ వల్లనే లాభాల్లోకి వచ్చాం..

మోహిత్ గుప్తా రాజీనామా పై జొమటో ఫౌండర్, సీఈఓ దీపేందర్ గోయల్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఎంజీ((Mohit Gupta).. మీరు ఇన్నాళ్లు నాకు ఒక స్నేహితుడిలా, సోదరుడిలా ఈ వ్యాపారంలో సహకరించారు. మీ వల్లనే అంతరించిపోయే స్థితి నుంచి లాభాలను గడించే స్థాయికి జొమాటో చేరింది. మన వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లారు. ఇంత పెద్ద సంస్థ నిర్వహణ ఎలా ఉండాలో మీరు నాకు నేర్పించారు’’ అని దీపేందర్ తెలిపారు.

Zomato co-founder Mohit Gupta resigns: నష్టాలు తగ్గాయి. .

మోహిత్ గుప్తా గతంలో పెప్సీ కంపెనీల, ట్రావెల్ పోర్టల్ మేక్ మై ట్రిప్ లలో సీనియర్ హోదాల్లో పని చేశారు. గత మూడు నెలల్లో జొమాటో తన నష్టాలను గణనీయంగా తగ్గించుకోగలిగింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జొమాటో నష్టాలు రూ. 430 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అవి రూ. 251 కోట్లకు తగ్గాయి. సంస్థ ఆపరేషన్స్ ఆదాయం కూడా గత తో పోలిస్తే 63% పెరిగింది. ఈ లో సంస్థ ఆపరేషన్స్ ఆదాయం రూ. 1661 కోట్లు.

టాపిక్