తెలుగు న్యూస్  /  Business  /  Whatsapp Brings Ability To Share Up To 100 Media For These Users

WhatsApp latest feature: వాట్సాప్ లో లేటెస్ట్ ఫీచర్; 100 మందికి పంపించవచ్చు..

HT Telugu Desk HT Telugu

07 February 2023, 15:23 IST

    • WhatsApp latest feature: సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకేసారి 100 మీడియా ఫైల్స్ ను షేర్ చేసేలా యాప్ ను అప్ డేట్ చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp latest feature: ఒకేసారి 100 మీడియా ఫైల్స్ ను షేర్ చేసే అవకాశం ఇకపై వాట్సాప్ (WhatsApp) యూజర్లకు లభించనుంది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది ఎంపికచేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

WhatsApp latest feature: బీటా యూజర్లకు మాత్రమే..

వాట్సాప్ (WhatsApp) యాప్ ను అప్ డేట్ చేసుకున్న, ఆండ్రాయిడ్ 2.23.4.3 (android 2.23.4.3 version) వర్షన్ తో ఉన్న బీటా యూజర్లకు ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ WhatsApp యూజర్లు ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ లోని వాట్సాప్ ను లేటెస్ట్ వర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలి. భవిష్యత్తులో మిగతా యూజర్లకు కూడా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. WhatsApp లో ఒకేసారి 30 కి పైగా మీడియా ఫైల్స్ ను షేర్ చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఈ ఫీచర్ అందుబాటులో ఉందో, లేదో యూజర్లు తెలుసుకోవచ్చు. ఒకవేళ 30 కి పైగా మీడియా ఫైళ్లను ఒకేసారి, చాట్ లో షేర్ చేయగలిగితే, ఆ WhatsApp యూజర్ కు 100 ఫైళ్ల వరకు షేర్ చేసే సదుపాయం ఉన్నట్లు భావించవచ్చు. ప్రతీసారి వేర్వేరుగా ఫొటోలు, లేదా మీడియా ఫైల్స్ ను షేర్ చేయడానికి బదులుగా ఒకే క్లిక్ తో మొత్తం అల్బమ్ ను ఈ ఫీచర్ ద్వారా షేర్ చేయవచ్చు.

WhatsApp latest feature: మరికొన్ని ఫీచర్లు కూడా..

ఇదే కాకుండా, మరికొన్ని కొత్త, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కూడా వాట్సాప్ (WhatsApp) సిద్ధం చేస్తోంది. ఇంపార్టెంట్ చాట్స్ ను సులభంగా గుర్తించేలా పిన్ చేసుకునే సదుపాయాన్ని మరింత విస్తరించింది. గ్రూప్స్ చాట్స్, ఇండివిడ్యువల్ చాట్స్ లో ముఖ్యమైన సందేశాలను ఇకపై ప్రత్యేకంగా పిన్ చేసుకోవచ్చు. అయితే, ఇందుకు కూడా వాట్సాప్ (WhatsApp) యూజర్ లేటెస్ట్ వర్షన్ కు అప్ డేట్ అయి ఉండాలి.

టాపిక్