WhatsApp news: ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు; లిస్ట్ లో మీ ఫోన్ ఉందేమో చూడండి-whatsapp to stop working on these old phones from feb 1 full list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Whatsapp To Stop Working On These Old Phones From Feb 1: Full List

WhatsApp news: ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు; లిస్ట్ లో మీ ఫోన్ ఉందేమో చూడండి

HT Telugu Desk HT Telugu
Feb 01, 2023 09:58 PM IST

WhatsApp news: సెక్యూరిటీ కారణాల రీత్యా పాత ఓఎస్ లపై పని చేస్తున్న ఫోన్లకు వాట్సాప్ తన సర్వీసులను నిలిపివేస్తూ ఉంటుంది. తాజాగా, మరికొన్ని ఫోన్ల నుంచి కూడా వాట్సాప్ సేవలను నిలిపేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

WhatsApp news: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ వర్షన్ 4.0.3 ఆ పై సాఫ్ట్ వేర్ వర్షన్ ఉన్న ఫోన్లలో, ఐ ఫోన్లలో ఐఓఎస్ (iOS) వర్షన్ 12 ఆ పై వర్షన్ల ఫోన్లలోనే వాట్సాప్ (WhatsApp) సేవలు లభిస్తాయి.

WhatsApp wont work on these phones : వాట్సాప్ సేవలు నిలిచిపోయే ఫోన్లు ఇవే.

యాపిల్ ఐఫోన్లలో ఐ ఫోన్ 6S (Apple iPhone 6S), ఐ ఫోన్ 6S Plus, (Apple iPhone 6S Plus), ఐ ఫోన్ SE (1st Gen) (Apple iPhone SE 1st Gen) ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వాట్సాప్ (WhatsApp) పని చేయదు. అలాగే, సామ్సంగ్ కంపెనీకి చెందిన ఆండ్రాయిడ్ ఫోన్లలో Samsung Galaxy Core, Samsung Galaxy Trend Lite, Samsung Galaxy Ace 2, Samsung Galaxy S3 Mini, Samsung Galaxy Trend Ii, Samsung Galaxy X Cover 2 ఫోన్లలో కూడా వాట్సాప్ పని చేయదు.

WhatsApp wont work on these phones : ఇవి కాకుండా..

ఇవి కాకుండా, ZTE V956 – Umi X2, ZTE Grand S Flex, ZTE Grand Memo, Huawei Ascend Mate, Huawei Ascend G740, Lg Optimus L3 Ii Dual, Lg Optimus L5 Ii, Lg Optimus F5, Lg Optimus L5 Dual, Lg Optimus L7 Dual, Lg Optimus F3, Lg Optimus F6, Sony Xperia M, Lenovo A820 తదితర ఫోన్లలోనూ ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ (WhatsApp) పని చేయదు.

New feature in WhatsApp: కొత్త ఫీచర్

మరోవైపు, మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ (WhatsApp) సైలెంట్ గా లాంచ్ చేసింది. కొత్తగా వీడియో రికార్డింగ్ ల కోసం కెమెరా మోడ్ ను ఇంట్రడ్యూస్ చేసింది. గతంలో కెమెరా బటన్ ను నొక్కి పట్టుకున్నంత వరకే రికార్డింగ్ జరిగేది. కానీ ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేస్తే చాలు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.23.2.73 update వర్షన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కెమెరా మోడ్ కావాలనుకునే వారు గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి, తమ ఫోన్లలో వాట్సాప్ (WhatsApp) యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.

WhatsApp channel

టాపిక్