WhatsApp live location: ‘వాట్సాప్ లైవ్ లొకేషన్’ ను ఇలా వాడండి..
WhatsApp live location: యూజర్లకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ సరికొత్తగా లైవ్ లొకేషన్ (WhatsApp live location) ఫీచర్ ను లాంచ్ చేసింది.
WhatsApp live location: కంట్రోల్ కూడా చేసుకోవచ్చు..
యూజర్లు ఎవరికి, ఎంతసేపు లైవ్ లొకేషన్ (live location) ను షేర్ చేయాలనే విషయాన్ని తామే కంట్రోల్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే లైవ్ లొకేషన్ (live location) ను షేర్ చేసుకోవడం స్టాప్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ (WhatsApp live location) కు కూడా వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ (end-to-end encryption) ఫెసిలిటీ ఇస్తోంది. అంటే, మీరు షేర్ చేసిన వ్యక్తి, లేదా గ్రూప్ మినహాయిస్తే, మరెవరూ మీ లైవ్ లొకేషన్ ను చూడలేరు. ఈ లైవ్ లొకేషన్ ఫీచర్ (WhatsApp live location) ను వాడాలంటే యూజర్లు ముందుగా వాట్సాప్ కు లొకేషన్ (location) పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ (settings) లోకి వెళ్లాలి. అనంతరం అక్కడి యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ (Apps and notifications) పై ట్యాప్ చేయాలి. ఆ తరువాత అడ్వాన్స్ డ్ (Advanced) పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపిస్తున్న యాప్ పర్మిషన్స్ (App permissions) కనిపిస్తాయి. అక్కడ వాట్సాప్ (WhatsApp) లోగో ఎదురుగా ఉన్న ట్యాగిల్ ను ఆన్ చేయాలి.
WhatsApp live location: లైవ్ లొకేషన్ షేర్ చేయడం ఎలా?
- ముందుగా మీ ఫోన్ లోని వాట్సాప్ (WhatsApp) ను ఓపెన్ చేయాలి.
- మీరు లొకేషన్ షేర్ చేయాలనుకునే చాట్ (chat) లోకి వెళ్లాలి.
- అక్కడ అటాచ్ (attach) పై ట్యాప్ చేయాలి.
- అనంతరం, ఆన్ లొకేషన్ పై ట్యాప్ చేయాలి. ఆ తరువాత, ట్యాప్ ఆన్ షేర్ లైవ్ లొకేషన్ ను ట్యాప్ చేయాలి.
- ఎంతసేపు లైవ్ లొకేషన్ ను షేర్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. నిర్ధారిత సమయం ముగియగానే లైవ్ లొకేషన్ నిలిచిపోతుంది.
- చివరగా సెండ్ (send) పై ట్యాప్ చేస్తే, మీ లైవ్ లొకేషన్ సంబంధిత చాట్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది.
- ఒకవేళ నిర్ధారిత సమయం కన్నా ముందుగానే, లైవ్ (live location) లొకేషన్ ను నిలిపేయాలనుకుంటే, ఆ అవకాశం కూడా ఉంది. సంబంధిత చాట్ లోకి వెళ్లి, స్టాప్ షేరింగ్ (Stop sharing) పై ట్యాప్ చేసి, ఆ తరువాత స్టాప్ నొక్కండి.
టాపిక్