వాట్సాప్ యూజర్లు వందలాది గ్రూపులతో సతమతమవుతుంటారు. ఇలాంటప్పుడు కొన్నిసార్లు ముఖ్యమైన సందేశాలు, చాట్స్ మిస్ అవుతుంటారు. అత్యంత ప్రాధాన్యత గల ఐదు చాట్స్ మీరు టాప్‌లో ఉంచుకునేలా పిన్ చేసుకోవడానికి వీలుగా వాట్సాప్ కొత్త ఫీచర్ తేబోతోంది. ప్రస్తుతం మూడు చాట్స్ పిన్ చేసుకోవడానికి వీలుంది. వాబీటాఇన్ఫో అందించిన వివరాల ప్రకారం త్వరలోనే 5 చాట్స్ పిన్ చేసుకునే వీలుంది.
ఈ ఫీచర్ లైవ్ కాగానే యూజర్లు 5 చాట్స్ టాప్‌లో పిన్ చేసుకోవచ్చు. తద్వారా వారికి అత్యంత ముఖ్యమైన చాట్స్‌ను సులువుగా చేరుకోవచ్చు.
‘చాట్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పిన్ చేసుకునే సౌలభ్యం ఉంటే యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పిన్ చేసిన చాట్స్ పరిమితి పెరగడం సమంజసంగా ఉంటుంది..’ అని సంబంధిత నివేదికలో వాబీటాఇన్ఫో తెలిపింది.
ప్రస్తుతానికి వాట్సాప్ యూజర్లు మూడు చాట్స్ పిన్ చేసుకోవచ్చు. యాప్‌లోనూ, డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ ఇది అందుబాటులో ఉంటుంది. వాట్సాప్‌లో చాట్స్ పిన్ చేసుకునేందుకు ఈ కింది స్టెప్స్ అనుసరించండి.
Step 1- మీ డివైజ్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
Step 2- ఆపిల్ ఐఫోన్ అయితే మీరు పిన్ చేయాలనుకున్న చాట్‌ను రైట్‌కు స్వైప్ చేయండి.
Step 3- ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మీరు పిన్ చేయాలనుకున్న చాట్ హోల్డ్ చేయండి.
Step 4- డెస్క్‌టాప్ వెర్షన్ అయితే మీరు చాట్‌పై హోవర్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ యారో కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి.
Step - క్లిక్ చేశాక చాట్ పిన్ చేయండి.
కాగా వాట్సాప్ మరో ఫీచర్ అందుబాటులోకి తేబోతోంది. స్టేటస్ అప్‌డేట్స్‌ను యూజర్లు రిపోర్ట్ చేసేందుకు వీలుంటుంది. స్టేటస్ సెక్షన్‌లో న్యూ మెనూ ద్వారా యూజర్స్ రిపోర్ట్ చేయొచ్చు. ఎవరైనా యూజర్ స్టేటస్ అప్‌డేట్ అనుమానాస్పాదంగా కనిపిస్తే, అంటే సేవల నిబంధనలను ఉల్లంఘిస్తే, యూజర్లు దానిని రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది.