మీరు మీ లైవ్ లొకేషన్ షేర్ చేయాల్సి వచ్చినపుడు వాట్సాప్ ద్వారా చేసి ఉంటారు. అయితే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి కూడా చేయవచ్చు. ఇది మరింత కచ్చితంగా, మరింత సమాచారంతో ఉంటుంది. ఎలా చేయాలో ఇక్కడ చూడండి..

(1 / 7)
ముందుగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో Google Maps యాప్‌ని తెరవాలి. ఆపై కుడి ఎగువన ఉన్న మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయండి.
(Google Maps)
(2 / 7)
అక్కడ డ్రాప్-డౌన్‌లో 'లొకేషన్ షేరింగ్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
(Google Maps)
(3 / 7)
ఇప్పుడు మీ అవసరాలకు అనుగుణంగా షెడ్యూల్‌ను ఎంచుకోండి. మీరు 1 గంట నుంచి 12 గంటల వరకు లేదా మీరు షేరింగ్ ఆపే వరకు Google లైవ్ లొకేషన్ షేరింగ్‌ని కొనసాగించవచ్చు.
(Google Maps)(4 / 7)
ఇప్పుడు మీరు ఎవరికైతే మీ లైవ్ లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో మీ లిస్టు నుంచి వారి Google ఖాతాను ఎంచుకోవాలి.
(REUTERS)
(5 / 7)
మీరు Google IDని టైప్ చేయడం ద్వారా లేదా డ్రాప్ డౌన్ నుండి ఎంచుకోవచ్చు
(AFP)(6 / 7)
ఈ లైవ్ లొకేషన్ ను మీరు మీ మెసెంజర్, WhatsApp, ఇతర యాప్‌ల ద్వారా కూడా షేర్ చేయవచ్చు.
(Reuters)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు