WhatsApp news: ఒక్క నెలలో 36.77 లక్షల వాట్సాప్ అకౌంట్ల బ్యాన్; ఎందుకో తెలుసా?
WhatsApp news: 2022 డిసెంబర్ నెలలో మొత్తం 36.77 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ (WhatsApp) ప్రకటించింది.
WhatsApp news: ప్రముఖ ఇన్ స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) భారతీయ ఐటీ రూల్స్ కు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే, డిసెంబర్ నెలలో మొత్తం 3,677,000 వాట్సాప్ (WhatsApp ) ఖాతాలను నిలిపివేసినట్లు (WhatsApp) వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
WhatsApp news: నిబంధనలకు అనుగుణంగా లేని..
డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య నిబంధనలకు అనుగుణంగా లేని ఖాతాలు, యూజర్లు ఫిర్యాదు చేసిన ఖాతాలు.. మొత్తం 3,677,000 అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ (WhatsApp) వెల్లడించింది. వాటిలో 1,389,000 అకౌంట్లను యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకముందే, ఐటీ రూల్స్ కు అనుగుణంగా లేవని గుర్తించి బ్యాన్ చేయడం జరిగిందని వెల్లడించింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఇండియా మంత్లీ రిపోర్ట్ లో వాట్సాప్ (WhatsApp) ఈ వివరాలను వెల్లడించింది. భారత ప్రభుత్వం కఠిన ఐటీ రూల్స్ ను 2022 లో అమల్లోకి తీసుకువచ్చింది. వీటి ప్రకారం.. 50 లక్షలకు మించి సబ్ స్క్రైబర్లు ఉన్న అన్ని మేజర్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నెలవారీగా తమకు అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలు మొదలైన వాటిని పబ్లిష్ చేయాల్సి ఉంటుంది.
WhatsApp news: అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో..
ఈ నిబంధనలపై మొదట ఫేస్ బుక్, ట్విటర్ తదితర మేజర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వ్యతిరేకత వ్యక్తం చేశాయి. విద్వేష ప్రచారం, తప్పుడు వార్తల సర్క్యులేషన్, శాంతి భద్రతలను దెబ్బతీసే వార్తలు వైరల్ కావడం.. మొదలైన వాటిని అడ్డుకోవడం కోసం భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని మేజర్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఐటీ రూల్స్ ను కచ్చితంగా పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.