NPS Withdrawal Process : ఎన్పీఎస్ నుంచి నగదును ఉపసంహరించుకోవడం ఎలా?
03 December 2022, 11:58 IST
- What is NPS withdrawal process : ఎన్పీఎస్ నుంచి నగదును ఉపసంహరించుకోవాలని చూస్తున్నారా? మీకు ఆ ప్రక్రియ తెలియదా? అయితే ఇది మీ కోసమే..
ఎన్పీఎస్ నుంచి నగదును ఎలా ఉపసంహరించుకోవాలి?
What is NPS withdrawal process : నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వం మద్దతున్న ఎన్పీఎస్ పెన్షన్ ప్లాన్‌లో పెట్టుబడుల ప్రవాహం.. ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఈక్విటీ, డెట్ ఆప్షన్లు కలిగి ఉండటంతో ఈ ఎన్పీఎస్ స్కీమ్ మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. అయితే.. కొన్ని కారణాల వల్ల ఎన్పీఎస్ నుంచి అత్యవసరంగా నగదును విత్‌డ్రా చేయాల్సి వస్తుంది. ఎన్పీఎస్ నుంచి నగదు ఉపసంహరణ ప్రక్రియ, నిబంధనల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము.
ఎన్పీఎస్ నగదు ఉపసంహరణ నిబంధనలు..
పాక్షికంగా నగదును ఉపసంహరించుకోవాలంటే..
కొన్ని అనారోగ్య సమస్యలకు చికిత్స, ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, పిల్లల పైచదువుల కోసమే.. పాక్షికంగా నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం..
- పాక్షికంగా నగదును ఉపసంహరించుకోవాలంటే కనీసం 3ఏళ్లు అయినా ఎన్‌పీఎస్‌లో ఖాతా ఉండాలి.
- 25శాతం నగదును మాత్రమే ఉపసంహరించుకోగలరు.
రిటైర్మెంట్ కోసం..
- NPS Withdrawal : ఎన్పీఎస్ ద్వారా జమ అయిన కార్పస్ మొత్తం విలువ రూ. 2లక్షల లేదా అంత కన్నా తక్కువగా ఉంటే.. మొత్తం ఫండ్‌ను ఉపసంహరించుకోవచ్చు.
- కార్పస్ విలువ రూ. 2లక్షలు దాటితే.. ఇందులో 40శాతం యాన్యుటీ ప్లాన్ కొనుగోలుకు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన నగదును లంప్సమ్ రూపంలో ఉపసంహరించుకోవచ్చు. లేదా.. 70ఏళ్లు వచ్చేంత వరకు కూడా ఎదురుచూడవచ్చు.
వాలంటరీగా తప్పుకుంటే..
సబ్స్క్రైబర్లు.. వాలంటరీగా ఎన్పీఎస్ నుంచి తప్పుకోవచ్చు. అయితే..
- కనీసం 10ఏళ్లు అయినా ఎన్పీఎస్ ఖాతాను హోల్డ్ చేసి ఉండాలి.
- కార్పస్ విలువ రూ. 1లక్ష లేదా అంత కన్నా తక్కువగా ఉంటే.. పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.
- కార్పస్ విలువ రూ. 1లక్ష దాటితే.. 80శాతం అమౌంట్ అనేది యాన్యుటీ ప్లాన్ కొనుగోలుకు వెళుతుంది.
ఎన్పీఎస్ నుంచి నగదు ఉపసంహరణ ప్రక్రియ..
NPS Withdrawal process : ఈ ప్రక్రియ.. టయర్-1 అకౌంట్‌కు, టయర్-2 అకౌంట్‌కు వేరువేరుగా ఉంటుంది.
టయర్-1 అకౌంట్:-
ఆన్లైన్ మోడ్:
స్టెప్-1 : NSDL- CRA అఫీషియల్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
స్టెప్-2 : మీ యూజర్ ఐడీ(పీఆర్ఏఎన్), పాస్‌వర్డ్‌ను టైప్ చేసి లాగిన్ అవ్వాలి.
స్టెప్-3 : ట్రాన్సాక్ట్ ఆన్‌లైన ట్యాబ్‌లో విత్డ్రావెల్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
స్టెప్-4 : ఉన్న ఆప్షన్స్‌లో 'పార్షియల్ విత్డ్రావెల్ ఫ్రం టయర్-1' ను ఎంచుకోవాలి.
స్టెప్-5 : పీఆర్ఏఎన్ను చూసి.. సబ్మీట్ చేయాలి.
స్టెప్-6 : నగదును ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు? ఎంత నగదును బయటకు తీస్తున్నారు(పర్సెంటేజ్లో)? వంటివి చెప్పాలి.
స్టెప్-7 : సబ్మీట్ మీద క్లిక్ చేయాలి.
How to withdraw money from NPS : దీని తర్వాత.. ఓ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్‌ను.. ఒరిజినల్ ప్రాన్ కార్డ్, కేవైసీ డాక్యుమెంట్లు, అకౌంట్ హోల్డర్ సంతకం చేసి రెవెన్యూ స్టాంప్‌తో కూడిన అడ్వాన్స్ స్టాప్ రెసిప్ట్, బ్యాంక్ లెటర్‌హెడ్, బ్యాంక్ పాస్‌బుక్, కన్సిల్ చేసిన చెక్, బ్యాంక్ ఐఎప్ఎస్సీ కోడ్, అండర్‌టేకింగ్ ఫామ్‌తో కలిపి.. నోడల్ ఆఫీసర్‌కు సబ్మీట్ చేయాల్సి ఉంటుంది.
అఫ్లైన్ మోడ్:-
సంబంధిత ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకుని, వివరాలను రాసి, సంబంధిత డాక్యుమెంట్లతో జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. సమీపంలోని ప్రిసెనస్ సర్వీస్ ప్రొవైడర్(పీఓపీ/పీఓపీ- ఎస్పీ) వద్ద ఫామ్‌ను సబ్మీట్ చేయాల్సి ఉంటుంది.
టయర్ 2 నగదు ఉపసంహరణ ప్రక్రియ..
ఆఫ్‌లైన్ మోడ్‌లో నగదును ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం.. యూఓఎస్-ఎస్12 ఫామ్‌ను నింపి.. సంబంధిత పత్రాలతో జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పీఓపీ-ఎస్పీకి సబ్మీట్ చేయాలి. మూడు రోజుల్లోగా నగుదు మీ చేతికి వస్తుంది.