తెలుగు న్యూస్  /  Business  /  This Womens Day, Let's Aim To Adopt Some Of These Investment Mantras

Women’s Day 2023 : మహిళలూ.. ఈ 'ఇన్​వెస్ట్​మెంట్​' సూత్రాలు మీకోసమే!

Sharath Chitturi HT Telugu

06 March 2023, 12:14 IST

    • International Women's day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమీపిస్తోంది. మహిళలు.. కొన్ని ముఖ్యమైన ఇన్​వెస్ట్​మెంట్​ సూత్రాలను నేర్చుకోవడానికి ఇదే సరైన సమయం. మరి ఆలస్యం ఎందుకు? మీ ఇన్​వెస్ట్​మెంట్​ కెరీర్​ను ఇలా మొదలుపెట్టిండి..
మహిళలూ.. ఈ 'ఇన్​వెస్ట్​మెంట్​' సూత్రాలు మీకోసమే!
మహిళలూ.. ఈ 'ఇన్​వెస్ట్​మెంట్​' సూత్రాలు మీకోసమే! (MINT_PRINT)

మహిళలూ.. ఈ 'ఇన్​వెస్ట్​మెంట్​' సూత్రాలు మీకోసమే!

International Women's day 2023 : మహిళలు చాలా తెలివైనవారు. ఇంటిని చక్కదిద్దడంలో దిట్ట! తల్లులు, అక్కలు, చెళ్లిల్లు ప్రశాంతంగా ఉంటే.. ఆ ఇల్లంతా సుఖంగా ఉంటుంది. ఇక పొదుపు విషయాల్లో మహిళలకు మించిన వారు ఎవరుంటారు? పోపుల డబ్బాల్లో, బీరువాల్లో నగదును పొదుపు చేస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆదుకుంటుంటారు. అయితే.. ఇప్పుడు కాలం మారింది. డబ్బును పొదుపు చేస్తే సరిపోదు, దానిని సరైన మార్గాల్లో 'ఇన్​వెస్ట్'​ చేయాలి కూడా! మహిళలకు పొదుపుతో పాటు 'ఇన్​వెస్ట్​మెంట్​' గురించి కూడా అవగాహన ఉండాలి. ఇన్​వెస్ట్​మెంట్​ పాఠాలు నేర్చుకోవడం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఓ మంచి అవకాశం. ఈ నేపథ్యంలో కొన్ని ఇన్​వెస్ట్​మెంట్​ సూత్రాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Cibil score : జీవితంలో ఎప్పుడూ లోన్​ తీసుకోకపోయినా.. సిబిల్​ స్కోర్​పై ఎఫెక్ట్​ పడుతుందా?

Mahindra XUV 3XO vs Tata Nexon : ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్​ నెక్సాన్​.. ఏది బెస్ట్​?

ఆర్థికపరమైన గోల్స్​ ఉండాల్సిందే..

పర్సనల్​​ ఫైనాన్స్​లో ప్రప్రథమమైనది 'గోల్​'. జీవితంలో ఓ గోల్​ ఉండాలి. అదే విధంగా ఆర్థికాల్లోనూ గోల్​ ఉండాలి. అప్పుడే వాటిని దృష్టిలో పెట్టుకుని మనం మెరుగైన నిర్ణయాలు తీసుకుంటాము. గోల్స్​ని.. దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక లక్ష్యాలు అని రెండు భాగాలుగా విడదీయవచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్​, ఇన్​వెస్ట్​మెంట్స్​ చేసుకుంటే ఇంకా మించిది. మార్కెట్​లను ప్రెడిక్ట్​ చేయడం అసాధ్యం. అందుకే రెగ్యులర్​గా ఇన్​వెస్ట్​ చేస్తూ ఉంటే.. మంచి రిటర్నులు చూడవచ్చు. గోల్స్​కి తగ్గట్టుగా ఇవి ఉండాలి.

పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్​..

Investment tips for women's day 2023 : ఎందుకు ఇన్​వెస్ట్​ చేస్తున్నాము? ఎంత కాలం వరకు ఇన్​వెస్ట్​ చేస్తున్నాము? వంటి అంశాలు.. మన ఇన్​వెస్ట్​మెంట్​ ఆప్షన్స్​ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు.. మ్యూచువల్​ ఫండ్స్​ అంటే దీర్ఘకాలంలో మంచి రాబడి తెచ్చిపెడతాయి. వాటిల్లో స్వల్పకాలానికి ఇన్​వెస్ట్​ చేస్తే అంత ఉపయోగం ఉండకపోవచ్చు. అదే సమయంలో.. వివిధ అసెట్స్​లో ఇన్​వెస్ట్​మెంట్​ చేస్తూ ఉంటాలి. కేవలం స్టాక్​ మార్కెట్​, కేవలం మ్యూచువల్​ ఫండ్స్​ అని పట్టుకోకూడదు. గోల్డ్​, భూమి వంటిపైనా ఫోకస్​ చేయాలి. ఇలా చేస్తే.. ఏదైనా సెక్టార్​ డీలాపడి మనం నష్టపోయినా.. ఇతర వాటిల్లో లాభాలు చూడవచ్చు.

క్వాలిటీకి వాల్యూ ఇవ్వండి..

Investment tips for women : ఈ కాలంలో పెట్టుబడులకు చాలా ఆప్షన్స్​ సులభంగా దొరికేస్తున్నాయి. కానీ వాటిల్లో క్వాలిటీతో కూడిన ఆప్షన్స్​ చాలా తక్కువ! ఫండమెంటల్​గా బలంగా ఉన్న అసెట్స్​లో పెట్టుబడులు పెట్టుకుంటే.. మనం సుఖంగా నిద్రపోవచ్చు. రిస్క్​ ఎక్కువగా ఉండి, కారణాలే లేకుండా పెరిగిపోతున్న అసెట్స్​లో పెట్టుబడి పెడితే.. ముందు లాభాలు కనిపించినప్పటికీ, ఆ తర్వాత నష్టపోయే అవకాశాలే అధికం! ఓ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటే.. దాని క్యాష్​ఫ్లో, ఆర్​ఓఈ వంటి ఫండమెంటల్స్​ని చూడాలి.

ఎమర్జెన్సీ ఫండ్- రిటైర్మెంట్​ ఫండ్​.. రెండూ ముఖ్యమే..

అత్యవసర పరిస్థితులు ఎప్పుడు, ఎలా తలుపు తడతాయో చెప్పడం కష్టం. అప్పటి వరకు సంతోషంగా ఉండే జీవితాలు.. హఠాత్తుగా తలకిందులైపోవచ్చు. వాటిని ఆపడం మన వల్ల కాదు! కానీ అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు మనం ముందు నుంచే సన్నద్ధమవ్వచ్చు. ఎమర్జెన్సీ ఫండ్​ ఇందుకు ఉదాహరణ. అత్యవసర పరిస్థితుల్లో డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇది చేస్తుంది.

ఇక రిటైర్మెంట్​ కోసం ముందు నుంచే ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం. అందుకు తగ్గట్టు ఇన్​వెస్టమెంట్స్​ను ప్లాన్​ చేసుకోవాలి. కొన్ని ప్రత్యేకించి ప్లాన్స్​ వీటికోసమే ఉంటాయి. ఫలితంగా.. రిటైర్మెంట్​ తర్వాత కూడా మనం ప్రశాంతంగా పడుకోవచ్చు!

పాసివ్​ ఇన్​వెస్ట్​మెంట్​ చేయండి..

Investment tips for 2023 : ఇండియాలో పాసివ్​ ఇన్​వెస్ట్​మెంట్​కు డిమాండ్​ ఈ మధ్య కాలంలోనే పెరుగుతోంది. ఈటీఎఫ్​లు, ఫండ్​ ఆఫ్​ ఫండ్స్​, ఇండెక్స్​ ఫండ్స్​ ఇందుకు ఉదాహరణ. వీటిల్లో రిస్క్​ తక్కువగా ఉంటుంది.

ఎమోషన్స్​ను పక్కన పెట్టండి..

ఇన్​వెస్ట్​మెంట్స్​ సమయంలో మనసు చెప్పింది కాకుండా.. బ్రెయిన్​ చెప్పింది వినాలి! ముఖ్యంగా స్టాక్​ మార్కెట్​లో 24 గంటలు న్యూ ఫ్లో ఉంటుంది. ప్రతి దానికి మార్కెట్​ రియాక్ట్​ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో మన పోర్ట్​ఫోలియో ఒడుదొడుకులకు లోనవుతుంది. దానితో పాటు మన మనస్సు కూడా మారిపోతూ ఉంటే.. దీర్ఘకాలంలో మంచి రిటర్నులు దక్కించుకోవడం కష్టం. ఒక అసెట్​పై రీసెర్చ్​ చేయాలి, దానిని నమ్మి పెట్టుబడులు పెట్టాలి. థీమ్​ ప్లే అయ్యేంత కాలం.. అది పెరిగినా, పడినా పట్టించుకోకూడదు.

--- రాఘవ్​ అయ్యంగార్​, యాక్సిస్​ ఏఎంసీ చీఫ్​ బిజినెస్​ ఆఫీసర్​.