How to build an emergency fund : 'ఎమర్జెన్సీ ఫండ్​'- ఆపత్కాలంలో అభయ హస్తం!-how to build an emergency fund ways to save money for tough days ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  How To Build An Emergency Fund: Ways To Save Money For Tough Days

How to build an emergency fund : 'ఎమర్జెన్సీ ఫండ్​'- ఆపత్కాలంలో అభయ హస్తం!

Sharath Chitturi HT Telugu
Feb 19, 2023 11:09 AM IST

How to build an emergency fund : ప్రతి మనిషి జీవితంలోనూ కచ్చితంగా ఉండాల్సిన కొన్నింట్లో ఎమర్జెన్సీ ఫండ్​ ఒకటి. కష్టకాలంలో ఎమర్జెన్సీ ఫండ్​ ఆదుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ఫండ్​ కోసం పాటించాల్సిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాము.

'ఎమర్జెన్సీ ఫండ్​'- ఆపత్కాలంలో అభయ హస్తం!
'ఎమర్జెన్సీ ఫండ్​'- ఆపత్కాలంలో అభయ హస్తం!

How to build an emergency fund : జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. అంతా బాగుంది అని అనుకున్న మరు క్షణమే.. జీవితం తలకిందులైపోవచ్చు. ఆ సమయంలో డబ్బు అవసరం ఉండి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అయితే.. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. అందుకు ఉన్న ఓ గొప్ప ఆయుధం.. 'ఎమర్జెన్సీ ఫండ్​'. ప్రతి మనిషికి ఎమర్జెన్సీ ఫండ్​ అనేది ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో.. ఎమర్జెన్సీ ఫండ్​ రూపొందించుకోవడానికి పాటించాల్సిన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

చిన్నగా మొదలుపెట్టండి..

ఎమర్జెన్సీ ఫండ్​లో రాత్రికి రాత్రే భారీ మొత్తంలో నిధులు వేయడం చాలా కష్టమైన పని. అందుకే చిన్న చిన్నగా మొదలుపెట్టాలి. ఎమర్జెన్సీ ఫండ్​లో ఎంత నిధులు వేస్తున్నాము అని కాకుండా.. ఎంత రెగ్యులర్​గా వేస్తున్నాము అన్నదే ముఖ్యం. నెలకు రూ. 200, రూ. 500 వేసినా పర్లేదు. కానీ ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఫండ్​లో ఎంతో కొంత నిధులు వేస్తూ ఉండాలి.

టార్గెట్​ పెట్టుకుని పొదుపు చేసేయండి..

Emergency fund rules in Telugu : జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. టార్గెట్​ ఉంటే మనం ఇంకా సీరియస్​గా ఉంటాము. ఎమర్జెన్సీ ఫండ్​ విషయంలోనూ ఇంతే! ఎమర్జెన్సీ ఫండ్​లో ఎంత మేర నిధులు ఉండాలన్నది ముందే నిర్ణయించుకోవాలి. సాధారణంగా అయితే.. 3-6 నెలల పాటు మన అన్ని ఖర్చులకు సరిపడా నిధులు ఎమర్జెన్సీ ఫండ్​లో ఉండటం శ్రేయస్కరం అని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఒకవేళ మన మీద ఆధారపడి ఎవరైనా ఉంటే.. వారి ఖర్చులను కూడా కలుపుకునే ఎమర్జెన్సీ ఫండ్​ టార్గెట్​ పెట్టుకోవాలి.

ఆటోమెటిక్​గా కట్​ అవ్వాలి..

మ్యూచువల్​ ఫండ్స్​, లోన్స్​.. ఇప్పుడు చాలా వరకు అన్ని ఆటోమెటిక్​గానే కట్​ అయిపోతున్నాయి. ఎమర్జెన్సీ ఫండ్​కి కూడా ఈ వెసులుబాటును ఇచ్చే విధంగా మనం చర్యలు చేపట్టాలి. అప్పుడు మనం మర్చిపోవడానికి వీలు కూడా ఉండదు.

వేరే అకౌంట్​ ఏర్పాటు చేసుకోవాలి..

Emergency fund calculator : మన సేవింగ్స్​, కరెంట్​ అకౌంట్​ వంటిని, ఎమర్జెన్సీ ఫండ్​తో ముడిపెట్టకూడదు. ఎమర్జెన్సీ ఫండ్​ కోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్​ ఉండాలి. ఈ విధంగా.. పొరపాటునైనా ఎమర్జెన్సీ ఫండ్​ నుంచి డబ్బులు తీసే అవకాశం ఉండదు.

యూపీఐ ట్రాన్సాక్షన్స్​ వద్దు..

లావాదేవీలు చేయాలంటే ఒకప్పుడు ఏటీఎంకో, బ్యాంక్​కో వెళ్లి డబ్బులు డ్రా చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడంతా మొబైల్​లోనే జరిగిపోతున్నాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్​తో క్షణాల్లో నగదు బదిలీ జరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక్కోసారి ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా తెలియకుండా పోతోంది. అందుకే.. ఎమర్జెన్సీ ఫండ్​ ఉండే అకౌంట్​ను యూపీఐతో జత చేయకపోవడం ఉత్తమం. ఇన్​కమింగ్​ ఒకటే ఇచ్చి.. ఔట్​గోయింగ్​ ఆపేస్తే.. మన ఎమర్జెన్సీ ఫండ్​ పదిలం!

పెట్టుబడులకు కాదు ఎమర్జెన్సీ ఫండ్​..

Emergency fund investment : ఎమర్జెన్సీ ఫండ్​ని, ఇన్​వెస్ట్​మెంట్​ని వేరువేరుగా చూడాలి. డబ్బులు ఉన్నాయి కదా అని.. పెట్టుబడులు పెట్టకూడదు. మనకి ఎప్పుడు డబ్బులు అవసరం పడుతుందో తెలియదు కాబట్టి.. ఎమర్జెన్సీ ఫండ్​లో నిధులు సిద్ధంగా ఉండాలి. 

ఖర్చులు తగ్గించుకోండి..

ఎమర్జెన్సీ ఫండ్​లో వేసే నిధులను ఎప్పటికప్పుడు పెంచుకుంటే వెళితే.. మన టార్గెట్​ను తొందరగా చేరుకుంటాము. ఇందుకోసం ఒక చిన్న సలహా ఇస్తుంటారు ఆర్థిక నిపుణులు. కొంత కాలం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని, మిగిలిన డబ్బులను ఎమర్జెన్సీ ఫండ్​లో వేస్తే మంచిదని సూచిస్తుంటారు.

కాస్త సమయం పట్టినా.. మన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు ఎమర్జెన్సీ ఫండ్​ ఎంతో కీలకం వ్యవహరిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఆర్థిక అక్షరాస్యతకు ఈ ఎమర్జెన్సీ ఫండ్​ తొలి అడుగు. మీరు ఇప్పుడు చేసే చిన్న చిన్న పొదుపు.. రేపు కష్టకాలంలో భారీగా ఉపయోగపడుతుంది!

WhatsApp channel