Samsung Galaxy A34 launch : త్వరలోనే శాంసంగ్ గ్యాలెక్సీ ఏ34 లాంచ్..!
22 January 2023, 15:33 IST
Samsung Galaxy A34 launch in India : ఇండియా మార్కెట్లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది శాంసంగ్. ఈ స్మార్ట్‌ఫోన్ పేరు శాంసంగ్ గ్యాలెక్సీ ఏ34.
శాంసంగ్ గ్యాలెక్సీ ఏ34 వచ్చేస్తోంది!
Samsung Galaxy A34 launch : ఇండియా మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ సంస్థ శాంసంగ్ కృషిచేస్తోంది. ఇప్పటికే పలు మోడల్స్‌ను లాంచ్ చేసిన ఈ సౌత్ కొరియన్ సంస్థ.. ఇప్పుడు మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. శాంసంగ్ గ్యాలెక్సీ ఏ34 స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్.. యూఎస్ ఎఫ్‌సీసీ, ఇండియన్ బీఐఎస్‌తో పాటు వివిధ వెబ్‌సైట్స్‌లో ఇప్పటికే లిస్ట్ అయ్యింది.
శాంసంగ్ గ్యాలెక్సీ ఏ34.. ఎలా ఉంటుందంటే..!
మిడ్- రేంజ్ సెగ్మెంట్లో ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఏ34 స్మార్ట్‌ఫోన్ వస్తుందని సమాచారం. దీని ధర రూ. 30వేలలోపే ఉంటుందని తెలుస్తోంది. ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన ఫీచర్స్ ఇప్పటికే ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
Samsung Galaxy A34 features : గిజ్మోచైనా నివేదిక ప్రకారం.. ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఏ34 స్మార్ట్‌ఫోన్ యూరోపియన్ మోడల్లో.. మీడియాటెక్ డైమెన్షిటీ 1080 ప్రాసెసర్ ఉంటుంది. ఇతర మార్కెట్లలో ఎక్సినోస్ 1280 చిప్సెట్ ఉండనుందని సమాచారం.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ ఉండనుంది. టాప్‌లో డ్యూ డ్రాప్ నాచ్ ఉండే అవకాశం ఉంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కూడిన డిస్ప్లే ఉండొచ్చు. శాంసంగ్ గ్యాలెక్సీ ఏ34 స్మార్ట్‌ఫోన్‌లో డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుందని, రేర్‌లో కెమెరా బంప్ వంటివి ఉండవని సమాచారం.
Samsung Galaxy A34 price in India : ఇక ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఏ34 స్మార్ట్‌ఫోన్‌లో 48ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. మెయిన్ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు ఉండొచ్చు. ఇక సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉండొచ్చు. ఇందులో 5000 ఎంఏఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుందని సమాచారం. 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. అయితే.. రీటైల్ బాక్స్‌లో వాల్ ఛార్జర్ ఉండకపోవచ్చు. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్స్ వస్తాయి.
శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ.. ఏ23 5జీ..
Samsung Galaxy A14 5G price : ఇండియా మార్కెట్లో ఇటీవలే గ్యాలెక్సీ ఏ సిరీస్‌ను లాంచ్ చేసింది శాంసంగ్. ఇందులో గ్యాలెక్సీ ఏ14 5జీ, గ్యాలెక్సీ ఏ23 5జీ మోడల్స్ ఉన్నాయి. ఇవి ఇప్పటికే సేల్‌లోకి వచ్చాయి. శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్స్లోను ఈ ఫోన్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.