తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kotak Bank Q4 Results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

HT Telugu Desk HT Telugu

04 May 2024, 17:29 IST

  • Kotak Bank Q4 results: కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY24) ఫలితాలను శనివారం ప్రకటించింది. ఈ క్యూ 4 లో కొటక్ బ్యాంక్ 18% వృద్ధితో రూ. 4,133 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.

18 శాతం పెరిగిన కొటక్ బ్యాంక్ నికర లాభం
18 శాతం పెరిగిన కొటక్ బ్యాంక్ నికర లాభం (REUTERS)

18 శాతం పెరిగిన కొటక్ బ్యాంక్ నికర లాభం

Kotak Mahindra Bank Q4 results: ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ నికర లాభం రూ.4,133 కోట్లు అని ప్రకటించింది. ఇది గత సంవత్సరం క్యూ 4 తో పోలిస్తే 18 శాతం వృద్ధి అని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23)లో కోటక్ బ్యాంక్ రూ.3,496 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

మొత్తం ఆదాయం 13.78 వేల కోట్లు..

2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY24) లో కొటక్ మహింద్ర మొత్తం ఆదాయం రూ.15,285 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది రూ.12,007 కోట్లుగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే, కొటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank) 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.10,939 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 26 శాతం పెరిగి రూ.13,782 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ మొత్తం ఆదాయం 2022-23లో రూ.41,334 కోట్లు కాగా, అది 2023-24 లో రూ.56,072 కోట్లకు పెరిగింది.

నికర వడ్డీ ఆదాయం

నికర వడ్డీ ఆదాయం విషయానికి వస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ (Kotak Mahindra Bank) నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.25,993 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అది రూ.21,552 కోట్లుగా ఉంది. 2024 మార్చితో ముగిసే త్రైమాసికంలో ఈ ఎన్ఐఐ రూ.6,909 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ 4 లో అది రూ.6,103 కోట్లుగా ఉంది. అంటే దాదాపు 13 శాతం వృద్ధి.

డివిడెండ్

2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ (dividend) ను కూడా కోటక్ మహీంద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank) ప్రకటించింది. రూ. 5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ కు రూ.2 డివిడెండ్ ఇవ్వాలని బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

తదుపరి వ్యాసం