Samsung Galaxy M04 : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04 వచ్చేసింది.. ధర, ఫీచర్స్​ ఇవే!-samsung galaxy m04 launched in india check full details of the smartphone here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy M04 : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04 వచ్చేసింది.. ధర, ఫీచర్స్​ ఇవే!

Samsung Galaxy M04 : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04 వచ్చేసింది.. ధర, ఫీచర్స్​ ఇవే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 10, 2022 01:45 PM IST

Samsung Galaxy M04 : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04 ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ స్మార్ట్​ఫోన్​ ధర, ఫీచర్స్​ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04 వచ్చేసింది.. ధర, ఫీచర్స్​ ఇవే!
శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04 వచ్చేసింది.. ధర, ఫీచర్స్​ ఇవే! (representative image)

Samsung Galaxy M04 : ఇండియా మార్కెట్​లోకి గ్యాలెక్సీ ఎం04ను లాంచ్​ చేసింగి శాంసంగ్​. ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫో్​లో 6.5ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఇందులో వాటర్​డ్రాప్​ స్టైల్​ నాచ్​తో కూడిన ఫ్రెంట్​ కెమెరా సైతం ఉంది. ఈ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04లో 128జీబీ స్టోరేజ్​తో పాటు 1టీబీ వరకు మైక్రోఎస్​డీ కార్డ్​ ఆప్షన్​​ కూడా లభిస్తోంది. మీడియాటెక్​ హీలియో పీ35 ఎస్​ఓసీతో పాటు 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ ప్యాక్​ దీని సొంతం.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04 ధర..

ఇండియాలో శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04 (4జీబీ ర్యామ్​ + 64జీబీ స్టోరేజ్​) ధర రూ. 8,499గా ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ సేల్​.. ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్​లో ప్రారంభమవుతుంది.

Samsung Galaxy M04 price in India : శాంసంగ్​ ఇండియా వెబ్​సైట్​లోనూ ఈ స్మార్ట్​ఫోన్​ అందుబాటులో ఉండనుంది.​ బ్లూ, గోల్డ్​, మింట్​ గ్రీన్​, వైట్​ రంగుల ఆప్షన్స్​లో ఇది లభిస్తుంది.

గ్యాలెక్సీ ఎం04 స్పెసిఫికేషన్స్​- ఫీచర్స్​..

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04 ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్​లో 6.5ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఎల్​ఈడీ ఫ్లాష్​తో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ దీని సొంతం. 13ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా సెన్సార్స్​ ఇందులో ఉంటాయి. 5ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఇందులో ఉంటుంది. గ్యాలెక్సీ ఎం04లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది.

Samsung Galaxy M04 features : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం04లో రెండేళ్ల వరకు ఓఎస్​ అప్​గ్రేడ్స్​ను ఇస్తున్నట్టు సంస్థ పేర్కొంది. ఆండ్రాయిడ్​ 12 ఓఎస్​ ఇందులో ఉంటుంది. 10వాట్​ ఛార్జింగ్​ అడాప్టర్​తో పాటు కనెక్టివిటీలో భాగంగా 4జీ వోల్ట్​ఈ, వైఫై బ్లూటూత్​, జీపీఎస్​, యూఎస్​బీ-సీ పోర్ట్​, 3.5ఎంఎం ఆడియో జాక్​ వంటి ఫీచర్స్​ను ఇస్తోంది శాంసంగ్​. గ్యాలెక్సీ ఎం04లో ఫింగర్​ప్రింట్​ సెన్సార్​ లేదు. కానీ ఫేస్​ అన్​లాక్​ బయోమెట్రిక్​ సెటప్​ ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం