Samsung Galaxy S23 launch : 200ఎంపీ కెమెరాతో గ్యాలెక్సీ ఎస్​23.. లాంచ్​ డేట్​ ఇదే!-this is when samsung galaxy s23 might launch what to expect ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy S23 Launch : 200ఎంపీ కెమెరాతో గ్యాలెక్సీ ఎస్​23.. లాంచ్​ డేట్​ ఇదే!

Samsung Galaxy S23 launch : 200ఎంపీ కెమెరాతో గ్యాలెక్సీ ఎస్​23.. లాంచ్​ డేట్​ ఇదే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 06, 2022 04:17 PM IST

Samsung Galaxy S23 launch : శాంసంగ్​ నుంచి మరో స్మార్ట్​ఫోన్​ సిరీస్​ లాంచ్​కు సిద్ధమవుతోంది! ఆ వివరాలు..

200ఎంపీ కెమెరాతోగ్యాలెక్సీ ఎస్​23.. లాంచ్​ డేట్​ ఇదే
200ఎంపీ కెమెరాతోగ్యాలెక్సీ ఎస్​23.. లాంచ్​ డేట్​ ఇదే (MINT_PRINT/file)

Samsung Galaxy S23 launch : దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ శాంసంగ్​.. గ్యాలెక్సీ ఎస్​23తో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా.. ఈ గ్యాలెక్సీ ఎస్​23.. వచ్చే ఏడాది ఫిబ్రవరి తొలినాళ్లల్లో లాంచ్​ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా.. ఈ విషయంపై శాంసంగ్​ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

200ఎంపీ ప్రైమరీ కెమెరా..!

9టు5గూగుల్​ నివేదిక ప్రకారం.. గ్యాలెక్సీ ఎస్ సిరిస్​ లాంచ్​ 2023 ఫిబ్రవరిలో ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఇది మార్కెట్​లో అందుబాటులోకి వస్తుంది. ఇందుకోసం సౌత్​ కొరియాకు చెందిన శాంసంగ్​ ఈ ఈవెంట్​ను కూడా నిర్వహిస్తుందని వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే.. కొవిడ్​ సంక్షోభం తర్వాత.. శాంసంగ్​ సంస్థ భౌతికంగా ఈవెంట్​ను నిర్వహించడం ఇదే తొలిసారి అవుతుంది.

Samsung Galaxy S23 features : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23లో 200ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుందని సంస్థ ఇటీవలే ప్రకటించినట్టు.. ఈ విషయాన్ని సౌత్​ కొరియా మీడియా పేర్కొంది. అంతకన్నా ముందు.. గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రాలో 200ఎంపీ ఐసోసెల్​ హెచ్​పీ2 కెమెరా సెన్సార్​ ఉంటుందని ఓ టిప్​స్టర్​ పేర్కొన్నాడు .

"శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రాలో 200ఎంపీ కెమెరా ఉండొచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ఎస్​ఓసీ ఉండే అవకాశం ఉంది. రానున్న ఎస్​ సిరీస్​ బరువు 228గ్రాములుగా ఉంటుందని, గ్యాలెక్సీ ఎస్​22 అల్ట్రాకు ఉన్న విధంగా థిక్​నెస్​ ఉంటుందని వార్తలు వచ్చాయి," అని టిప్​స్టర్​ ఐస్​ యూనివర్స్​ తెలిపాడు.

గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రాలో 10ఎంపీ టెలిఫొటో కెమెరా లెన్స్​ కూడా ఉండొచ్చు. 10ఎక్స్​ ఆప్టికల్​ జూమ్​తో ఫొటోలు తీయవచ్చు అని ఆ టిప్​స్టర్​ స్పష్టం చేశాడు.

ఇక శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​ సిరీస్​లో కొత్త స్మార్ట్​ఫోన్ల ఫీచర్స్​, ధరలకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రకటించిన తర్వాతే ఓ క్లారిటీ వస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం