Samsung phones under 15000 : రూ. 15వేల లోపు బెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..
Samsung phones under 15000 : పండుగ డిస్కౌంట్లు, ఆఫర్లు అయిపోయాయి! ‘ఇప్పుడు స్మార్ట్‌ఫోన్స్ ధరలు పెరిగిపోతాయి, కొనాలంటే కష్టమే’ అని మీరు అనుకుంటున్నారా? రూ. 15వేల లోపు ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. శాంసంగ్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
(1 / 5)
Samsung Galaxy A13: ఈ 4జీబీ ర్యామ్- 128జీబీ వేరియంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో 24శాతం డిస్కౌంట్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 14,999గా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. ఇది రూ. 14,150కే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం ఆఫర్ కూడా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద రూ. 1000 ఆఫ్ కూడా ఉంది.(Samsung)
(2 / 5)
Samsung Galaxy F42 5G: ఈ 8జీబీ ర్యామ్- 128జీబీ వేరియంట్‌పై 42శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 14,999కే దీని ధర ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీద ఈ ఫోన్ రూ. 14,150కే అందుబాటులోకి వస్తోంది. వీటితో పాటు పలు బ్యాంక్‌ల కార్డులపై ఆఫర్లు ఉన్నాయి.(Samsung)
(3 / 5)
Samsung Galaxy M32: ఈ 4జీబీ ర్యామ్- 64జీబీ స్టోరేజీ ఫోన్‌పై 23శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 12,468గా ఉంది.(HT Tech)
(4 / 5)
Samsung Galaxy A03s: ఈ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 14శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 11,499కే ఇది ఉంది. ఎక్స్ఛేంజ్తో రూ. 10,950కే లభిస్తుంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.(Samsung)
(5 / 5)
Samsung Galaxy F23 5G: 39శాతం డిస్కౌంట్‌తో ఈ 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ రూ. 14,499కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాలో ఉంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్తో రూ. 13,600కే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో ఇది మరింత తగ్గుతుంది.(HT Tech)
ఇతర గ్యాలరీలు