Samsung: సామ్‍సంగ్ రెండు కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‍ల సేల్ మొదలు.. ధర, ఆఫర్ల వివరాలివే-samsung galaxy a14 5g samsung galaxy a23 5g smartphones launched in india check price offers sale specifications details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Samsung Galaxy A14 5g Samsung Galaxy A23 5g Smartphones Launched In India Check Price Offers Sale Specifications Details

Samsung: సామ్‍సంగ్ రెండు కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‍ల సేల్ మొదలు.. ధర, ఆఫర్ల వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 18, 2023 01:05 PM IST

Samsung Galaxy A14 5G, Galaxy A23 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ, సామ్‍సంగ్ గెలాక్సీ ఏ23 5జీ మొబైళ్ల సేల్ మొదలైంది. బడ్జెట్ రేంజ్‍లో ఈ రెండు 5జీ స్మార్ట్ ఫోన్‍లు లాంచ్ అయ్యాయి.

Samsung: సామ్‍సంగ్ రెండు కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‍ల సేల్ మొదలు (Photo: Samsung)
Samsung: సామ్‍సంగ్ రెండు కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‍ల సేల్ మొదలు (Photo: Samsung)

Samsung Galaxy A14 5G, Samsung Galaxy A23 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ, సామ్‍సంగ్ గెలాక్సీ ఏ23 5జీ స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్‍లో అడుగుపెట్టాయి. బడ్జెట్ రేంజ్‍లో లాంచ్ అయ్యాయి. నేడే (జనవరి 18) మొబైళ్ల సేల్ కూడా మొదలైంది. సామ్‍సంగ్ అధికారిక వెబ్‍సైట్‍లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. ఈ-కామర్స్ సైట్లలో సేల్ తేదీని కూడా సామ్‍సంగ్ (Samsung) ప్రకటించింది. గెలాక్సీ ఏ సిరీస్‍లో బడ్జెట్ 5జీ మొబైళ్లుగా ఇవి వచ్చాయి. బ్యాంక్ కార్డు ఆఫర్ వినియోగించుకుంటే గెలాక్సీ ఏ14 5జీని రూ.15వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. Samsung Galaxy A14 5G, Galaxy A23 5G ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ ధర, సేల్, ఆఫర్లు

Samsung Galaxy A14 5G Price in India: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

  • 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర: రూ.16,499
  • 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర: రూ.18,999
  • 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర: రూ.20,999

సామ్‍సంగ్ అధికారిక వెబ్‍సైట్ (Samsung.com)లో నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఈ మొబైల్ సేల్‍కు వచ్చింది. డార్క్ రెడ్, లైట్ గ్రీన్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది. ఈనెల 20వ తేదీన ఈ-కామర్స్ సైట్లు, ఆఫ్‍లైన్ స్టోర్లలో ఈ మొబైల్ సేల్‍కు వస్తుంది.

Samsung Galaxy A14 5G offer: ఎస్‍బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే గెలాక్సీ ఏ14 5జీపై రూ.1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించుకుంటే బేస్ మోడల్‍ను రూ.14,999కే సొంతం చేసుకోవచ్చు.

సామ్‍సంగ్ గెలాక్సీ ఏ23 5జీ ధర, సేల్, ఆఫర్లు

Samsung Galaxy A23 5G Price in India: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ23 5జీ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది.

  • 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర: రూ.22,999
  • 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర: రూ.24,999

ఈ మొబైల్ కూడా సామ్‍సంగ్ వెబ్‍సైట్‍లో సేల్‍కు వచ్చింది. ఈనెల 20వ తేదీన ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్‍లు, ఆఫ్‍లైన్ స్టోర్లలో లభిస్తుంది. సిల్వర్, లైట్ బ్లూ, ఆరెంజ్ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

Samsung Galaxy A23 5G offer: ఎస్‍బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ఈ ఫోన్‍పై రూ.2000 అదనపు తగ్గింపు పొందవచ్చు.

Samsung Galaxy A14 5G: స్పెసిఫికేషన్లు

  • 6.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ PLS LCD డిస్‍ప్లే, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్
  • ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్‍యూఐ 5 ఆపరేటింగ్ సిస్టమ్
  • 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ వెనుక కెమెరాలు
  • 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 5000mAh బ్యాటరీ

Samsung Galaxy A23 5G: స్పెసిఫికేషన్లు

  • 6.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ PLS LCD డిస్‍ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టమ్
  • ఈ మొబైల్ వెనుక నాలుగు కెమెరాలు (50 మెగాపిక్సెల్ (OIS) + 5 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్)
  • 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 5000mAh బ్యాటరీ

WhatsApp channel