Best Samsung smartphones under 50000 : రూ. 50వేలలోపు.. ది బెస్ట్​ శాంసంగ్​ ఫోన్స్​ ఇవే!-here are the 5 best samsung smartphones under 50000 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Samsung Smartphones Under 50000 : రూ. 50వేలలోపు.. ది బెస్ట్​ శాంసంగ్​ ఫోన్స్​ ఇవే!

Best Samsung smartphones under 50000 : రూ. 50వేలలోపు.. ది బెస్ట్​ శాంసంగ్​ ఫోన్స్​ ఇవే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 16, 2023 08:26 AM IST

Best Samsung smartphones under 50000 : ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్​లో శాంసంగ్​ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే.. రూ.50వేల బడ్జెట్​లో ది బెస్ట్​ శాంసంగ్​ స్మార్ట్​ఫోన్​ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

రూ. 50వేలలోపు.. ది బెస్ట్​ శాంసంగ్​ ఫోన్స్​ ఇవే!
రూ. 50వేలలోపు.. ది బెస్ట్​ శాంసంగ్​ ఫోన్స్​ ఇవే!

Best Samsung smartphones under 50000 : రూ. 50వేల బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం! ప్రస్తుతం ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్​ నడుస్తోంది. ఇందులో.. రూ. 50వేలలోపు లభిస్తున్న ది బెస్ట్​ శాంసంగ్​ స్మార్ట్​ఫోన్స్​పై ఓ లుక్కేద్దాం..

శాంసంగ్​ గ్యాలాక్సీ ఎస్​21 ఎఫ్​ఈ 5జీ..

Samsung Galaxy S21 FE 5G price : ఇందులో 6.4 ఇంచ్​ డిస్​ప్లే, ట్రిపుల్​ రేర్​ కెమెరా, 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీతో మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్​ ఉన్నాయి. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​21 ఎఫ్​ఈ 5జీ ధర రూ. 74,999. కానీ ఫ్లిప్​కార్ట్​లో 53శాతం డిస్కౌంట్​లో ఇది రూ. 34,999కే లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 20వేల తగ్గింపు లభిస్తోంది. ఈ డివైజ్​పై బ్యాంక్​ ఆఫర్స్​ కూడా ఉన్నాయి. ఫలితంగా ధర మరింత దిగొస్తుంది.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం53 5జీ..

Samsung Galaxy M53 5G : ఫ్లిప్​కార్ట్​లో ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 30,999గా ఉంది. ఈ మోడల్​పై ఎలాంటి డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్స్​ లేవు. కానీ.. బ్యంక్​ ఆఫర్స్​ కింద ధరను తగ్గించుకోవచ్చు. ఇందులో 6.7 ఇంచ్​ డిస్​ప్లే, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు మరిన్ని ఫీచర్స్​ ఉన్నాయి.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ73 5జీ..

Samsung Galaxy A73 5G : 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ73 5జీ వాస్తవ ధర రూ. 47,490. 11శాతం డిస్కౌంట్​లో ఇది ఫ్లిప్​కార్ట్​లో రూ. 41,999కే లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 22,000 తగ్గించుకోవచ్చు! బ్యాంక్​ ఆఫర్లు కూడా ఉండటం విశేషం. ఇందులో 6.7ఇంచ్​ డిస్​ప్లే, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉన్నాయి.

శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫ్లిప్​ 3 5జీ...

Samsung Galaxy Z flip 3 5G features : 47శాతం డిస్కౌంట్​లో 8జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​​ రూ. 49,925కే లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 95,999. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 25వేల తగ్గింపు కూడా ఉంది. ఇందులో 6.7 ఇంచ్​ డిస్​ప్లే, డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​, 3,300 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉన్నాయి.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ52ఎస్​ 5జీ..

Samsung Galazy A52s 5G specifications : ఈ 6జీబీ ర్యామ్​- 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 37,990గా ఉంది. ఈ మోడల్​పై ఎలాంటి డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ను ఫ్లిప్​కార్ట్​ ఇవ్వడం లేదు. బ్యాంక్​ ఆఫర్లు ఉన్నాయి. ఇందులో 6.5ఇంచ్​ డిస్​ప్లే, 4500 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం