తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Tv 65 Q2 Pro: వన్‍ప్లస్ నుంచి కొత్త ప్రీమియమ్ స్మార్ట్ టీవీ.. లాంచ్ డేట్ ఫిక్స్: వివరాలివే

OnePlus TV 65 Q2 Pro: వన్‍ప్లస్ నుంచి కొత్త ప్రీమియమ్ స్మార్ట్ టీవీ.. లాంచ్ డేట్ ఫిక్స్: వివరాలివే

24 January 2023, 20:35 IST

    • OnePlus TV 65 Q2 Pro: వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రీమియమ్ రేంజ్‍లో ఈ టీవీ అడుగుపెట్టనుంది.
OnePlus TV 65 Q2 Pro: వన్‍ప్లస్ నుంచి కొత్త ప్రీమియమ్ స్మార్ట్ టీవీ.. లాంచ్ డేట్ ఫిక్స్: వివరాలివే (Photo: OnePlus)
OnePlus TV 65 Q2 Pro: వన్‍ప్లస్ నుంచి కొత్త ప్రీమియమ్ స్మార్ట్ టీవీ.. లాంచ్ డేట్ ఫిక్స్: వివరాలివే (Photo: OnePlus)

OnePlus TV 65 Q2 Pro: వన్‍ప్లస్ నుంచి కొత్త ప్రీమియమ్ స్మార్ట్ టీవీ.. లాంచ్ డేట్ ఫిక్స్: వివరాలివే (Photo: OnePlus)

OnePlus TV 65 Q2 Pro launch date in India: పాపులర్ బ్రాండ్ వన్‍ప్లస్ (OnePlus) నుంచి ఫ్లాగ్‍షిప్ రేంజ్‍లో కొత్త స్మార్ట్ టీవీ రానుంది. వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో పేరుతో అడుగుపెట్టనుంది. ఈ ప్రీమియమ్ టీవీ లాంచ్ డేట్‍ను వన్‍ప్లస్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 7వ తేదీనే దీన్ని భారత్‍లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో వన్‍ప్లస్ 11 5జీ లాంచ్ ఈవెంట్‍లోనే ఈ క్యూ2 ప్రో టీవీ కూడా లాంచ్ కానడం కన్ఫర్మ్ అయింది. వివరాలివే..

ప్రీమియమ్ రేంజ్‍లో..

OnePlus TV 65 Q2 Pro: వన్‍ప్లస్ టీవీ క్యూ1 ప్రోకు సక్సెసర్‌గా ఈ వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో రానుంది. వన్‍ప్లస్.. మూడు సిరీస్‍‍ల స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తెస్తుంటుంది. వై సిరీస్‍లో బడ్జెట్, యు సిరీస్‍లో మిడ్ రేంజ్, క్యూ సిరీస్‍లో ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇప్పుడు రానున్న వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో.. ఫ్లాగ్‍షిప్ రేంజ్‍లోనే ఉండనుంది.

“అద్భుతమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో వన్‍ప్లస్ టీవీ 65 క్యూ 2 ప్రో అడుగుపెట్టనుంది. ప్రీమియమ్, స్మార్టర్ కనెక్టెడ్ ఎకో సిస్టమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ప్రీమియమ్ రేంజ్‍లో క్యూ1 సిరీస్‍కు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు 65 క్యూ2 ప్రోను తీసుకొస్తున్నాం” అని వన్‍ప్లస్ సీఈవో పెటే లవూ (Pete Lau) పేర్కొన్నారు.

వన్‍ప్లస్ 11 5జీ (OnePlus 11 5G), వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్.. ఫిబ్రవరి 7వ తేదీన జరిగే క్లౌడ్ 11ఈవెంట్‍లో లాంచ్ కానున్నాయి. వీటితో పాటు వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో స్మార్ట్ టీవీ కూడా అడుగుపెడుతుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ఈ ప్రీమియమ్ స్మార్ట్ టీవీ అందుబాటులోకి వస్తుంది.

వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ కూడా ఫ్లాగ్‍షిప్ రేంజ్‍లోనే అడుగుపెట్టనుంది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, హాసెల్‍బ్లాడ్ ప్రీమియమ్ కెమెరాలు, ఆకర్షణీయమైన డిస్‍ప్లే సహా అన్ని విభాగాల్లో ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో రానుంది.

టాపిక్