OnePlus 11 5G: ప్రీమియం స్పెసిఫికేషన్లతో అడుగుపెట్టిన వన్‍ప్లస్ 11 5జీ.. ఆల్‍రౌండ్ ఫ్లాగ్‍షిప్‍గా..
OnePlus 11 5G launched: వన్‍ప్లస్ 11 5జీ మొబైల్ చైనా మార్కెట్‍లో లాంచ్ అయింది. వచ్చే నెలలో ఈ ప్రీమియమ్ ఫ్లాగ్‍షిప్ ఫోన్ ఇండియాకు రానుంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్లు, ధర ఎలా ఉన్నాయంటే..
OnePlus 11 5G launched: పాపులర్ బ్రాండ్ వన్‍ప్లస్ 2023ను ఫ్లాగ్‍షిప్ మొబైల్‍తో ఘనంగా ఆరంభించింది. వన్‍ప్లస్ 11 5జీ ఫోన్‍ను చైనా మార్కెట్‍లో నేడు (జనవరి 4) లాంచ్ చేసింది. అన్ని విభాగాల్లో ప్రీమియం స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఈ మొబైల్ కలిగి ఉంది. ఇండియాలో ఫిబ్రవరి 7వ తేదీన ఈ ఫోన్‍ను లాంచ్ చేయనున్నట్టు వన్‍ప్లస్ ఇది వరకే ప్రకటించింది. అయితే, చైనాలో లాంచ్ అవటంతో వన్‍ప్లస్ 11 5జీకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు ఇప్పుడే తెలిసిపోయాయి. పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, అదిరిపోయే 2K డిస్‍ప్లేతో పాటు ఫ్లాగ్‍షిప్ కెమెరా సెన్సార్లను ఈ ఫోన్ కలిగి ఉంది. OnePlus 11 5G పూర్తి వివరాలు ఇవే.
వన్‍ప్లస్ 11 5జీ పూర్తి స్పెసిఫికేషన్లు
- OnePlus 11 5G Specifications: 6.7 ఇంచుల QHD+ 2K రెజల్యూషన్ LTPO 3.0 అమోలెడ్ డిస్‍ప్లేను వన్‍ప్లస్ 11 5జీ కలిగి ఉంది. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ ఉంటాయి. హెచ్‍డీఆర్, డాల్బీ విజన్ ప్లాట్‍ఫామ్‍లకు ఈ డిస్‍ప్లే సపోర్ట్ చేస్తుంది.
- వన్‍ప్లస్ 11 5జీ మొబైల్‍లో లేటెస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ఓఎస్ 13.0 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది. 12జీబీ, 16జీబీ ర్యామ్ వేరియంట్లు ఉన్నాయి.
- వన్‍ప్లస్ 11 5జీ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) 50 మెగాపిక్సెల్ Sony IMX890 ప్రైమరీ కెమెరా, 48 మెగాపిక్సెల్ Sony IMX58 అల్ట్రా వైడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ పోట్రయిట్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది.
- వన్‌ప్లస్ 11 5జీ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 100 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఈ మొబైల్‍కు ఉన్నాయి.
- డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.3 వెర్షన్, జీపీఎస్, ఎన్‍ఎఫ్‍సీ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. మొత్తంగా OnePlus 11 5G ఫోన్ 205 గ్రాముల బరువు ఉంటుంది.
వన్‍ప్లస్ 11 5జీ వేరియంట్లు, ధర
OnePlus 11 5G price: వన్‍ప్లస్ 11 5జీ మూడు వేరియంట్లలో చైనాలో అందుబాటులోకి వచ్చింది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యెన్లు (సుమారు రూ.48,000), 16GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర 4,399 యెన్లు (సుమారు రూ.53,000), 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర 4,899 యెన్లు (సుమారు రూ.59,000)గా ఉంది. ఎండ్‍లెస్ బ్లాక్, ఇన్‍స్టాంట్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. చైనాలో ఈనెల 9వ తేదీన సేల్‍కు వస్తుంది.
OnePlus 11 5G India launch date: ఇండియాలో ఫిబ్రవరి 7వ తేదీన వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ విడుదల కానుంది. అయితే చైనా కంటే భారత్‍లో ధర కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది.