OnePlus 11 5G India launch date: భారత్‍లో వన్‍ప్లస్ 11 5జీ లాంచ్ డేట్ ఫిక్స్! పూర్తి వివరాలు-oneplus 11 5g launch date in india revealed check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus 11 5g India Launch Date: భారత్‍లో వన్‍ప్లస్ 11 5జీ లాంచ్ డేట్ ఫిక్స్! పూర్తి వివరాలు

OnePlus 11 5G India launch date: భారత్‍లో వన్‍ప్లస్ 11 5జీ లాంచ్ డేట్ ఫిక్స్! పూర్తి వివరాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 20, 2022 11:34 PM IST

OnePlus 11 5G India launch date: ఇండియాలో వన్‍ప్లస్ 11 ఫోన్ విడుదల తేదీ వెల్లడైంది. ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో ఈ మొబైల్ రానుంది.

OnePlus 11 5G India launch date: భారత్‍లో వన్‍ప్లస్ 11 5జీ లాంచ్ డేట్ ఫిక్స్! పూర్తి వివరాలు (Photo Credit: OnLeaks/GadgetGang)
OnePlus 11 5G India launch date: భారత్‍లో వన్‍ప్లస్ 11 5జీ లాంచ్ డేట్ ఫిక్స్! పూర్తి వివరాలు (Photo Credit: OnLeaks/GadgetGang)

OnePlus 11 5G India launch date: ప్రముఖ మొబైల్ బ్రాండ్ వన్‍ప్లస్ (OnePlus) తదుపరి ఫ్లాగ్‍షిప్ సిరీస్‍ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వన్‍ప్లస్ 11 5జీ మొబైల్‍ను తీసుకురానుంది. భారత్‍లో ఈ ఫోన్ లాంచ్ డేట్‍ను కూడా ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి 7వ తేదీన ఇండియాలో వన్‍ప్లస్ 11 5జీ విడుదవుతుంది. క్లౌడ్ 11 (OnePlus Cloud 11 Event) పేరిట న్యూఢిల్లీలో జరగనున్న ఈవెంట్‍లో ఈ మొబైల్‍ను వన్‍ప్లస్ లాంచ్ చేయనుంది. అదే రోజు వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 (OnePlus Buds Pro 2) టీడబ్ల్యూఎస్ ఇయర్‍బడ్స్ ను కూడా తీసుకురానుంది. వన్‍ప్లస్ 11 5జీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

వన్‍ప్లస్ 11 5జీకి సంబంధించిన ఫొటోను, టీజర్‌ను ఆ సంస్థ వెల్లడించింది. దీంతోపాటు ఇప్పటికే చాలా వరకు స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. ఈ మొబైల్ కెమెరాలు కూడా హాసెల్‍బ్లాడ్ బ్రాండింగ్‍తోనే ఉండనున్నాయి. అయితే ఈసారి 11 సిరీస్‍లో ప్రో మోడల్ ఉండబోదని వన్‍ప్లస్ సంకేతాలు ఇచ్చింది. వన్‍ప్లస్ 11 5జీ ఫోన్‍నే టాప్ ఎండ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో తీసుకొస్తున్నట్టు చెప్పింది.

వన్‍ప్లస్ 11 5జీ స్పెసిఫికేషన్లు

OnePlus 11 5G Specifications: వన్‍ప్లస్ 11 5జీ ఫ్లాగ్‍షిప్ స్మార్ట్ ఫోన్‍కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు ఇప్పటికే బయటికి వచ్చాయి. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఈ మొబైల్‍లో ఉంటుంది. వెనుక మూడు ఫ్లాగ్‍షిప్ లెన్స్‌తో కూడిన కెమెరా సెటప్ ఉంటుంది. సర్క్యులర్ షేప్‍లో కెమెరా హంప్ పెద్దగా ఉండనుంది. కాగా, 6.7 ఇంచుల QHD+ అమోలెడ్ డిస్‍ప్లేను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండే అవకాశం ఉంది. వన్‍ప్లస్ ప్రత్యేకమైన అలర్ట్ స్లైడర్‍ తో ఈ మొబైల్ రానుంది. కాగా OnePlus 11 5G ఫోన్ 100 వాట్ల ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది.

కాగా, వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ చైనాలో జనవరి ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ దేశంలో ఎప్పుడు లాంచ్ చేయనున్నది కచ్చితమైన తేదీని వన్‍ప్లస్ ఇంకా వెల్లడించలేదు. టీజర్ ను మాత్రం విడుదల చేసింది. బ్లాక్ కలర్ వేరియంట్‍ను టీజ్ చేసింది. దీంతో బ్యాక్ ప్యానెల్ గ్లాసీ ఫినిష్‍ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Whats_app_banner