OnePlus: వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ ధర వివరాలు లీక్.. ఎంత ఉండొచ్చంటే..!-oneplus 11 5g price in india leaked know the details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oneplus 11 5g Price In India Leaked Know The Details

OnePlus: వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ ధర వివరాలు లీక్.. ఎంత ఉండొచ్చంటే..!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 24, 2023 05:13 PM IST

OnePlus 11 5G price in India: ఇండియాలో వన్‍ప్లస్ 11 5జీ ధర వివరాలు లాంచ్‍కు ముందే లీక్ అయ్యాయి. వన్‍ప్లస్ బడ్స్ 2 ప్రో ధర కూడా వెల్లడైంది.

OnePlus: వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ ధర వివరాలు లీక్.. ఎంత ఉండొచ్చంటే..! (Photo: OnePlus)
OnePlus: వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ ధర వివరాలు లీక్.. ఎంత ఉండొచ్చంటే..! (Photo: OnePlus)

OnePlus 11 5G price in India: వన్‍ప్లస్ 11 5జీ ఫ్లాగ్‍షిప్ మొబైల్ ఇండియాలో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 7వ తేదీన భారత్‍లో ఈ ప్రీమియమ్ ఫోన్ విడుదల కానుంది. చైనాలో ఈనెలలో అడుగుపెట్టిన ఈ ఫోన్.. భారత్‍లో మరో రెండు వారాల్లో లాంచ్ కానుంది. అయితే విడుదలకు ముందే.. వన్‍ప్లస్ 11 5జీ ధర ఇండియాలో ఎంత ఉంటుందనే సమాచారం లీక్ అయింది. మూడు వేరియంట్ల ధర వివరాలు బయటికి వచ్చాయి. దీంతోపాటు వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 (OnePlus Buds Pro 2) టీడబ్ల్యూఎస్ ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి. వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

వన్‍ప్లస్ 11 5జీ ధర

OnePlus 11 5G Price in India: వన్‍ప్లస్ 11 5జీ ధర వివరాలను ప్రైస్‍బాబా రిపోర్ట్ వెల్లడించింది. 12 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉండే వన్‍ప్లస్ 11 5జీ వేరియంట్ ధర భారత్‍లో రూ.54,999గా ఉంటుందని ఆ రిపోర్ట్ లీక్ చేసింది. 16జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.59,999, 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.66,999గా ఉంటుందని పేర్కొంది.

వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 ధర

OnePlus Buds Pro 2 Price: వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ధర భారత్‍లో రూ.11,999గా ఉంటుందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. ఏఎన్‍సీ, డైన్‍ఆడియో ట్యూనింగ్, చార్జింగ్ కేస్‍తో కలిపి 39 గంటల బ్యాటరీ లైఫ్‍తో ఈ నయా టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ రానున్నాయి.

OnePlus 11 5G India launch Details: ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు ఇండియాలో వన్‍ప్లస్ క్లౌడ్ 11 లాంచ్ ఈవెంట్ (Cloud 11 Launch Event) మొదలవుతుంది. ఈ ఈవెంట్‍లో వన్‍ప్లస్ 11 5జీ, వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, ఓ ఫ్లాగ్‍షిప్ టీవీని వన్‍ప్లస్ భారత్‍లో లాంచ్ చేయనుంది. ఆరోజున ధరతో పాటు పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనుంది.

వన్‍ప్లస్ 11 5జీ స్పెసిఫికేషన్లు

OnePlus 11 5G Specifications: చైనాలో ఇప్పటికే లాంచ్ అవటంతో వన్‍ప్లస్ 11 5జీ స్పెసిఫికేషన్లు తెలిసిపోయాయి. 6.7 ఇంచుల E4 LTPO 3.0 ఓఎల్ఈడీ డిస్‍ప్లేతో వన్‍ప్లస్ 11 5జీ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. క్వాల్‍కామ్ పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్‍తో అడుగుపెడుతుంది.

OnePlus 11 5G వెనుక హాసెల్‍బ్లాడ్ ఫ్లాగ్‍షిప్ కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ కెమెరా, 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ప్రీమియమ్ ఫోన్ వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‍లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. చైనాలో 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వచ్చింది. అయితే ఇండియా వేరియంట్ 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం