Oil companies profit on petrol : లీటరు పెట్రోల్‌పై చమురు సంస్థల లాభం ఎంతంటే..
08 January 2023, 7:47 IST
- Oil companies profit on petrol : దేశీయ చమురు సంస్థలు.. లీటరు పెట్రోల్‌పై రూ. 10 లాభాన్ని సంపాదిస్తున్నాయి. కానీ లీటరు డీజిల్‌పై రూ. 6.5 నష్టపోతున్నాయి.
లీటరు పెట్రోల్‌పై చమురు సంస్థల లాభం ఎంతంటే..
Oil companies profit on petrol : లీటరు పెట్రోల్‌పై చమురు సంస్థలు రూ. 10 లాభాలన్ని అర్జిస్తున్నాయి. అదే సమయంలో లీటరు డీజిల్‌పై రూ. 6.5 నష్టపోతున్నాయి. ఈ మేరకు ఇటీవలే బయటకొచ్చిన ఓ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
భారీ నష్టాల నుంచి తేరుకుని…!
చమురు విషయంలో భారత దేశం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దేశ చమురు అవసరాల్లో 85శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ఇక దేశంలోని చమురు మార్కెట్లో.. ప్రభుత్వ ఆధారిత ఐఓసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్), బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్), హెచ్‌పీసీఎల్ (హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) వాటా 90శాతం వరకు ఉంటుంది.
Petrol and Diesel price today : కొవిడ్ సంక్షోభం కారణంగా 2020లో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనయ్యాయి. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం కారణంగా చమురు ధరలు 2022లో దారుణంగా పెరిగాయి. 2022 మార్చ్‌లో బ్యారెల్ చమురు ధర 140 డాలర్లను తాకింది. ఇది 14ఏళ్ల గరిష్ఠం! ఆ తర్వాత నెమ్మదిగా దిగొస్తూ.. ఈ నెలలో బ్యారెల్‌కు 78 డాలర్లను తాకింది.
కాగా.. 2021 నవంబర్ వరకు దేశంలో చమురు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత 15 నెలలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం లేదు. చివరిగా 2022 ఏప్రిల్ 6న దేశంలో చమురు ధరల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ పరిణామాలతో చమురు సంస్థలు ఫైనాన్షియల్స్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రీటైల్ అమ్మకాల ధరల కన్నా ముడి సరకు ధరలు భారీగా ఉండటం కారణంగా.. చమురు సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. మొత్తం మీద ఏప్రిల్- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 21,201.18కోట్ల నెట్ లాస్‌ను నమోదు చేశాయి. చమురు సంస్థల నష్టానికి పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం యోచిస్తున్న తెలుస్తోంది.
Petrol rates today : అయితే.. చమురు సంస్థలు ప్రస్తుతం లీటరు పెట్రోల్‌పై రూ. 10 లాభాన్ని అర్జిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ లీటరు డీజిల్‌పై రూ. 6.5 నష్టపోతున్నట్టు సమాచారం.
"2022 జూన్ 24తో ముగిసిన వారంలో.. చమురు సంస్థలు రికార్డు నష్టాన్ని చూశాయి. లీటరు పెట్రోల్‌పై రూ. 17.4, లీటరు డీజిల్‌పై రూ. 27.7 నష్టపోయాయి. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. 2022 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో లీటరు పెట్రోల్‌పై చమురు సంస్థలు రూ. 10 లాభాన్ని అర్జించాయి. డీజిల్‌పై నష్టాలు కూడా దిగొచ్చాయి. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో లీటరు డీజిల్‌పై రూ. 6.5 నష్టాన్ని నమోదు చేశాయి," అని ఓ నివేదిక వెల్లడించింది. రానున్న కాలంలో చమురు సంస్థలు మళ్లీ లాభాల బాట పడతాయని అంచనాలు ఉన్నాయి.
Petrol and Diesel price in Hyderabad today : మొత్తం మీద 2022 ఏప్రిల్ 6 నుంచి దేశవ్యాప్తంగా చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 109.6గా ఉంది. ఇక లీటరు డీజిల్ ధర రూ. 97.82గా ఉంది. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ. 89.62గాను, లీటరు పెట్రోల్ ధర రూ. 96.72గా కొనసాగుతోంది.