Swiggy : 2022 స్విగ్గీ సెర్చ్ లిస్ట్.. పెట్రోల్- అండర్‌వేర్‌ని కూడా వెతికేశారు!
How India Swiggy'd 2022 : తమ ఇన్‌స్టామార్ట్ సేవల్లో పెట్రోల్, అండర్‌వేర్‌ని కూడా ప్రజలు వెతికారని స్విగ్గీ పేర్కొంది. దీనిపై నెటిజన్లు స్పందించారు.
How India Swiggy'd 2022 : స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కస్టమర్లు వెతికిన 'సెర్చ్ లిస్ట్'ను ఆ సంస్థ ఇటీవలే వెల్లడించింది. పెట్రోల్, అండర్వేర్ వంటి వాటి కోసం కస్టమర్లు వెతికినట్టు 'హౌ ఇండియా స్విగ్గీడ్ 2022' రిపోర్ట్‌లో తేలింది!
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో.. పెట్రోల్ కోసం 5,981 సెర్చ్‌లు వచ్చాయి. అండర్‌వేర్‌ను 8,810 మంది వెతికారు. సోఫాలు, బెడ్లను కూడా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో సెర్చ్ చేశారు.
Swiggy search list : అన్నిటికన్నా వింత సెర్చ్ పదం ఒకటి ఉంది. 'మామీ' అనే పదాన్ని 7,275 మంది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో వెతికారు. వీటిపై ఎలా స్పందించాలో తెలియక స్విగ్గీ ఆయోమయంలో పడింది!
'మీరు ఊహించని ఎన్నో విషయాలను ఇన్‌స్టామార్ట్‌లో సెర్చ్ చేశారు. పెట్రోల్‌కు 5,981.. అండర్‌వేర్‌కు 8,810.. మామీకి 7,275.. సోఫాకు 20,653.. బెడ్‌కు 23,432 సెర్చ్‌లు ఉన్నాయి,' అని ట్విట్టర్లో సైతం పోస్ట్ చేసింది స్విగ్గీ.
Petrol in Swiggy instamart : ఈ విషయంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా మంది షాక్‌కు గురయ్యారు. "ఇన్స్టెంట్గా అండర్వేర్ ఎవరికి కావాలి? దానిని ఎలా డెలివరీ తీసుకుంటారు?" అని ఓ నెటిజెన్ కామెంట్ పెట్టగా.. "ఇన్‌కాగ్నిటో మోడ్‌ను స్విగ్గీ ప్రవేశపెట్టాలి. ప్రజలు ఏం సెర్చ్ చేస్తున్నారో స్విగ్గీకి తెలియకూడదు," అని మరో వ్యక్తి రాసుకొచ్చారు. "వాహనంలో పెట్రోల్ అయిపోయి ఉంటుంది. అందుకే ప్రజలు సెర్చ్ చేసి ఉంటారు. వారికి స్విగ్గీ హెల్ప్ చేయాలి," అని మరో యూజర్ రాశారు.
బిర్యానీకి భలే గిరాకీ..!
Swiggy instamart : మరోవైపు 2022లో ప్రజలు ఎక్కువగా ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను తమ వార్షిక రిపోర్ట్‌లో వెల్లడించింది స్విగ్గీ. ఈ జాబితాలో ఈ ఏడాది కూడా బిర్యానీనే నిలిచింది. బిర్యానీ టాప్‌లో ఉండటం ఇది వరుసగా 7వ ఏడాది! 2022లో నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి.
2022 Swiggy orders list : అంతేకాకుండా.. 3.6కోట్ల చిప్స్ ప్యాకెట్‌ను డెలివరీ చేసినట్టు స్విగ్గీ చెప్పింది. దీపావళి రోజు బెంగళూరుకు చెందిన ఒకే వ్యక్తిని స్విగ్గీకి రూ. 75,378 విలువ చేసే ఆర్డర్ అందుకున్నట్టు పేర్కొంది. బెంగళూరులోనే మరో వ్యక్తి.. ఇన్‌స్టామార్ట్‌లో రూ. 16.6లక్షలు విలువ చేసే గ్రాసరీని 2022లో ఆర్డర్ చేసినట్టు వివరించింది. మరోవైపు పుణెకు చెందిన వ్యక్తి.. రూ. 71,229 ఖర్చు చేసి బర్గర్స్, ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాడు! ఇలా ఇంకెందరో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలను వినియోగించుకున్నారు.
సంబంధిత కథనం