Gongura Chicken Biryani Recipe : ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ.. రెసిపీ ఇదే..
Gongura Chicken Biryani Recipe : ఆంధ్రా వంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా గోంగూరతో చేసే ఏ వంటలైనా భోజన ప్రియులను ఇట్టే ఆకట్టుకుంటాయి. అయితే ఈరోజు నోరూరించే గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ గురించి తెలుసుకుందాం. ఈ టేస్టీ బిర్యానీని ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలి అనుకుంటారు.
Gongura Chicken Biryani Recipe : బిర్యానీ అనేది ప్రతి ఒక్కరికీ ఫేవరెట్ లిస్ట్‌లో కచ్చితంగా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ ఎంత ఫేమస్సో.. ఆంధ్రాలో గోంగూర బిర్యానీ కూడా అంతే ఫేమస్. గోంగూరతో చేసే ఈ బిర్యానీ.. వంటకాన్ని ప్రత్యేకమైన టేస్ట్ ఇస్తుంది. మరి ఈ టెస్టీ గోంగూర చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* చికెన్ - 500 గ్రాముసు (బోన్ లెస్)
* రిఫైన్డ్ ఆయిల్ - 60 గ్రాములు
* ఉల్లిపాయలు - 2 పెద్దవి (తరిగినవి)
* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 40 గ్రాములు
* టొమాటో - 50 గ్రాములు (ప్యూరీ చేసుకోవాలి)
* గోంగూర ఆకుల పేస్ట్ - 100 గ్రాములు (ఉడికించి పేస్ట్ చేసుకోవాలి)
* నీరు - 1 కప్పు
* కారం - 2 టీస్పూన్
* పసుపు - చిటికెడు
బిర్యానీ బియ్యం కోసం..
* బాస్మతి రైస్ - 750 గ్రాములు (80% వరకు ఉడికించండి)
* దేశీ నెయ్యి - 60 గ్రాములు
* కుంకుమపువ్వు - కొంచెం
* రోజ్ వాటర్ - 40 గ్రాములు
* పచ్చిమిర్చి - 100 గ్రాములు
* పుదీనా ఆకులు - 1 టీస్పూన్
* కొత్తిమీర - 2 టీస్పూన్స్
* ఉప్పు - తగినంత
గోంగూర చికెన్ బిర్యానీ తయారీ విధానం
ముందుగా గిన్నె తీసుకొని దానిలో నూనె వేడి చేసి.. దానిలో తరిగిన ఉల్లిపాయలు వేయండి. అవి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. టమోటో పేస్ట్, గోంగూర ఆకుల పేస్ట్ వేసి తక్కువ ఫ్లేమ్ మంట మీద వేగించండి. ఇప్పుడు బోన్ లెస్ చికెన్, కొద్దిగా నీళ్లు వేసి మరిగించండి. దానిని మూతతో కప్పి.. 10 నిమిషాలు ఉడికించండి. అనంతరం మూత తీసివేసి.. మసాలాలు వేసి.. మరగనివ్వండి. వాటిని బాగా కలిపి.. దానిలో ఉప్పు వేయండి.
ఇప్పుడు 80% వండిన బాస్మతి బియ్యాన్ని దానిపై వేయండి. దానిలో కరిగించిన దేశీ నెయ్యి, రోజ్ వాటర్, కుంకుమపువ్వు నీరు, వేయండి. తరిగిన కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు, కట్ చేసిన పచ్చిమిర్చిని చల్లుకోండి. చివరగా వేయించిన ఉల్లిపాయలు చల్లి.. మూతపెట్టి 20 నిమిషాలు దమ్‌లో ఉడికించండి. అంతే టేస్టీ టేస్టీ గోంగుర చికెన్ బిర్యానీ రెడీ.
సంబంధిత కథనం