Korma Egg Biryani । చలికాలంలో కోర్మా గుడ్డు బిర్యానీ.. దీని రుచికి నాలుక కోసుకుంటారు!-very special korma egg biryani to try in the winter season recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Korma Egg Biryani । చలికాలంలో కోర్మా గుడ్డు బిర్యానీ.. దీని రుచికి నాలుక కోసుకుంటారు!

Korma Egg Biryani । చలికాలంలో కోర్మా గుడ్డు బిర్యానీ.. దీని రుచికి నాలుక కోసుకుంటారు!

HT Telugu Desk HT Telugu
Dec 08, 2022 01:47 PM IST

Korma Egg Biryani: కోర్మా ఎగ్ బిర్యానీ మామూలు ఎగ్ బిర్యానీ కంటే ఇంకా రుచికరమైన బిర్యానీ. ఎలా తయారు చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.

Korma Egg Biryani
Korma Egg Biryani (Slurrp)

బిర్యానీ అనేది క్లాసిక్ వంటకం , దీనికి పరిచయం అవసరం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టపడే రుచికరమైన రైస్ డిష్ అని మనందరికీ తెలుసు. సుమధుర సుగంధాలతో సువాసనలు వెదజల్లే వేడివేడి బిర్యానీ తినకుండా ఉండనిది ఎవరు? మెన్యూలో ఎన్ని రకాల వంటకాలు ఉన్న బిర్యానీదే పైచేయి. అనేక పదార్థాలు, ఫ్లేవర్లతో లోడ్ చేసి ఉండే ఈ వంటకంను తలుచుకుంటేనే నోరు ఊరుతుంది. మనసు బిర్యానీ తినాలి అని మారాం చేస్తుంది. లంచ్ అయినా, డిన్నర్ అయినా కుదిరితే బ్రేక్‌ఫాస్ట్‌‌లో అయినా బిర్యానీ తినేందుకు ఎప్పుడు రెడీగా ఉంటారు.

వెజిటెబుల్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇలా దేనితో వండినా బిర్యానీ రుచి తగ్గదు. అయితే మీకు ఇప్పుడు ఒక స్పెషల్ ఎగ్ బిర్యానీ రెసిపీని పరిచయం చేస్తున్నాం. ఎగ్ బిర్యానీ అనగానే మనకు బిర్యానీ అన్నంలో బాయిల్డ్ ఎగ్ కలిపి ఇవ్వడమే ఎక్కువగా తెలుసు, లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది కాకుండా కోర్మా ఎగ్ బిర్యానీ రుచిని ఎప్పుడైనా ఆస్వాదించారా? ఇది మామూలు ఎగ్ బిర్యానీ కంటే ఇంకా రుచికరమైన బిర్యానీ. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి, కావాలసిన పదార్థాలేమి తెలుసుకోండి. కోర్మా ఎగ్ బిర్యానీ రెసిపీ ఈ కింద చూడండి.

Korma Egg Biryani Recipe కోసం కావలసినవి

  • బాస్మతి బియ్యం - 200 గ్రాములు
  • గుడ్లు - 3
  • ధనియాల పొడి - 1/2 టీస్పూన్
  • అల్లం పేస్ట్ - 1/2 టీస్పూన్
  • కొత్తిమీర ఆకులు - 1/2 tsp
  • పసుపు పొడి - 1/2 tsp
  • గరం మసాలా - 1/2 tsp
  • టొమాటో పేస్ట్ - 1/2 స్పూన్
  • కోర్మా మసాలా - 1 tsp
  • జీలకర్ర-1/2 టీస్పూన్
  • దాల్చిన చెక్క - 1 ముక్క
  • ఉప్పు - రుచి ప్రకారం
  • నెయ్యి-2 టీ స్పూన్లు
  • ఉల్లిపాయలు - 2
  • పెరుగు - 50 గ్రాములు
  • ఫెన్నెల్ - 1/2 tsp
  • వెల్లుల్లి - 3 మొగ్గలు
  • పెరుగు - 1/2 కప్పు
  • లవంగాలు-2-3

కోర్మా ఎగ్ బిర్యానీ రెసిపీ- ఎలా తయారు చేయాలి

  1. ముందుగా బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి, ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
  2. కాసేపయ్యాక అందులో కోర్మా మసాలా, మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి.
  3. ఆపై పెరుగు వేసి ఏడెనిమిది నిమిషాలు ఉడికించాలి.
  4. మరో పాత్రలో బియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి.
  5. కోర్మా మసాలా ఉడికిన తర్వాత, ఉడకబెట్టిన అన్నాన్ని వేసి ఉడికించాలి.
  6. అన్నంలో నీరు పోయి, దగ్గరకు వచ్చాక బాణిలిలో మూడు చోట్ల ఒక గరిటెతో బోలుగా చేయాలి. ఆపైన ప్రతి బోలులో 1 గుడ్డు పగులగొట్టండి.

ఐదు నిమిషాల పాటు మూతపెట్టి ఉడికించాలి.

  1. ఆపైన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.

అంతే ఘుమఘుమలాడే కోర్మా ఎగ్ బిర్యానీ రెడీ. సలాన్‌తో కలిపి తింటే భలేగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం