Boiled Eggs Health Benefits । గుడ్లు ఉడకబెట్టుకొని తింటేనే ఆరోగ్యానికి మంచిది, ప్రయోజనాలు ఇవే!-eggs contain more nutrition know health benefits of eating boiled ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Boiled Eggs Health Benefits । గుడ్లు ఉడకబెట్టుకొని తింటేనే ఆరోగ్యానికి మంచిది, ప్రయోజనాలు ఇవే!

Boiled Eggs Health Benefits । గుడ్లు ఉడకబెట్టుకొని తింటేనే ఆరోగ్యానికి మంచిది, ప్రయోజనాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Dec 04, 2022 12:59 PM IST

Boiled Egg Health Benefits: మీకు గుడ్లు అంటే ఇష్టమైన ఆహారమా? అయితే ఉడకబెట్టుకొని తినండి, ఒక ఉడికించిన గుడ్డును తినడం ద్వారా మీకు లభించే పోషకాలు, వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.

Boiled Egg Health Benefits
Boiled Egg Health Benefits (Pixabay)

గుడ్లు అనేవి అందరికీ అందుబాటులో లభించే పవర్-ప్యాక్డ్ సూపర్‌ఫుడ్. ఈ గుడ్లలో ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి. ఏ వంటకమైన గుడ్లతో సులభంగా, చిటికెలో చేసుకోవచ్చు. వీటితో వండే ఎలాంటి వంటకాలైనా ఎంతో రుచికరంగా ఉంటాయి. చాలా మందికి గుడ్లు ఫేవరెట్ ఫుడ్. గుడ్లను ఏ విధంగా అయినా వండుకోవచ్చు, ఎన్నో రకాల వెరెటీలు చేసుకోవచ్చు. గుడ్డుతో ఆమ్లెట్ చేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసి ఎగ్ భుర్జీ చేసుకోవచ్చు, ఉడికించుకొని తినవచ్చు, లేదా కొంతమంది నేరుగా పచ్చివి కూడా తినేస్తారు.

అయితే, గుడ్లను నూనెలో వేయించి తినడం లేదా పచ్చిగా తినడం కంటే బాగా ఉడికించుకొని తింటేనే చాలా ఆరోగ్యకరమని పోషకాహార నిపుణులు అంటున్నారు. గుడ్డును హార్డ్- బాయిల్డ్ చేసుకొని తింటే అందులోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయని చెబుతున్నారు.

Boiled Egg Nutrition - ఉడకబెట్టిన గుడ్డులో పోషకాలు

ఉడికించిన ఒక గుడ్డు సుమారు 77 కేలరీలు కలిగి ఉంటుంది. అలాగే ఉడికించిన గుడ్డులో విటమిన్లు A, B5, B12, D, E, K, B6 లతో పాటు ఫోలేట్, భాస్వరం, సెలీనియం, కాల్షియం, జింక్ వంటి మూలకాలు, ఇంకా ఆరు గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల ఉడికించుకొని తినడం ద్వారా ఈ పోషకాలు శరీరానికి అందుతాయి. పచ్చిగా లేదా ఫ్రై చేసుకొని తింటే అందులో పోషకాలు లోపిస్తాయని సూచిస్తున్నారు.

Boiled Egg Health Benefits- ఉడకించిన గుడ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఉడకబెట్టిన గుడ్లు తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

ఉడికించిన గుడ్డులో జింక్‌తో పాటు విటమిన్‌ బి6 , బి12 మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఫ్లూ, జలుబును నివారించడంలో సహాయపడతాయి. చలికాలంలో మన రోగనిరోధక శక్తిని తగ్గుతుంది. కాబట్టి రోజుకో ఉడికించిన గుడ్డు తీసుకోవడం వల్ల శీతాకాలంలో ఎదురయ్యే సమస్యలను నిరోధించవచ్చు.

బరువు తగ్గడానికి ఉత్తమం

ఉడికించిన గుడ్డులో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు మంచి మోతాదులో ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది శక్తివంతమైన ఆహారం. శీతాకాలంలో చల్లటి వాతావరణం కలిగే బద్ధకంను పోగొట్టి మీ శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. మీ ఫిట్‌నెస్ మెరుగుపడేందుకు సహాయపడుతుంది.

మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి

ఉడికించిన గుడ్లు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి, అయితే ఇది శరీరానికి ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్ (HDL). నిజానికి ఈ HDL అనేది అధిక సాంద్రత కలిగిన ఒక లిపోప్రొటీన్. శరీరంలో HDL స్థాయిలు సరైన మోతాదులో ఉంటే అవి స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలవని అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే ఫ్రై చేసుకొని తినే గుడ్లు ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంటుంది.

కంటి చూపును కాపాడుకోవడానికి

ఉడికించిన గుడ్డు పచ్చసొన తినడం ద్వారా పెద్ద మొత్తంలో లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి కంటిశుక్లం , కళ్ళలో మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు. గుడ్లలో విటమిన్ ఎ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కాబట్టి ఉడికించిన గుడ్లు తరచూ తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి ఇన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం