Boiled Egg on Toast Breakfast | ఈ అల్పాహారం ఎంతో రుచికరం, పోషకభరితం!
Boiled Egg on Toast Recipe: సండేని ఫన్ డేగా మార్చుకోండి. రుచికరమైన అల్పాహారంతో ఈరోజును స్టార్ట్ చేయండి. ఉడకబెట్టిన గుడ్డుతో టోస్ట్ ఎలా చేసుకోవాలో రెసిపీ ఇక్కడ చూడండి.
రుచికరమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడానికి మించిన మంచి మార్గం మరొకటి లేదు. అందుకే ఈ ఆదివారం మీకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని పరిచయం చేస్తున్నాం. ఇది చేసుకోవటం కూడా చాలా తేలిక, ఎంతో రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరమైనది కూడా.
టోస్ట్ మీద ఉడకబెట్టిన గుడ్డు ముక్కలను ఉంచి. సాల్ట్- పెప్పర్ వేసి, కొన్ని కూరగాయలను కూడా జోడించి. నోట్లో నములుకుంటూ తింటే నమ్మశక్యం కాని రుచిని ఆస్వాదించవచ్చు. అయితే వండుకునే విధానం సరిగ్గా ఉండాలి.
ఈ రెసిపీలో ప్రధాన భాగం గుడ్లను సరైన సమయం పాటు ఉడకబెట్టడం. కేవలం 6- నిమిషాల పాటు గుడ్డును ఉడికించి చేసుకుంటే రుచిగా ఉంటుంది. కాబట్టి ముందుగానే గిన్నెలో నీటిని మరిగించి గుడ్లు ఉడికించుకోవాలి. ఒకవేళ రిఫ్రిజిరేటర్ నుండి తీసిన గుడ్లయితే అవి గది ఉష్ణోగ్రత వద్దకు మారేంత వరకు బయట ఉంచి, ఆపై ఉడికించుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన వెజిటెబుల్స్‌తో కలుపుకోవచ్చు. ప్రోటీన్‌తో నిండిన ఈ బ్రేక్‌ఫాస్ట్ టోస్ట్ మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా బాయిల్డ్-ఎగ్ టోస్ట్ రెసిపీని చూసేయండి.
Boiled Egg on Toast Recipe కోసం కావలసినవి
- 2 - గుడ్లు
- 2- బ్రెడ్ ముక్కలు
- 2-3 ఆకులు - పాలకూర
- 2 - చెర్రీ టమోటాలు
- 1 టేబుల్ స్పూన్ - స్పైసీ మాయో లేదా మీకు నచ్చిన ఏదైనా స్ప్రెడ్
- మిరియాల పొడి చిటికెడు
- కారంపొడి చిటికెడు
- ఉప్పు చిటికెడు
- వెన్న 1 టీస్పూన్
బాయిల్డ్-ఎగ్ టోస్ట్ తయారీ విధానం
- ముందుగా ఒక గిన్నెల్లో నీటిని మరిగించి, అందులో నెమ్మడిగా గుడ్లను జార విడవండి. సరిగ్గా ఆరు నిమిషాలు ఉడికించాలి.
- మరోవైపు బ్రెడ్‌కి కొద్దిగా వెన్నపూసి, పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి.
- ఆపై ఈ బ్రెడ్ టోస్టుపై మయో క్రీమ్ లేదా మీకు నచ్చిన స్ప్రెడ్‌ను పూసి శుభ్రమైన తాజా పాలకూర ఆకులు, సగానికి కట్ చేసిన చెర్రీ టమోటాలను ఉంచండి.
- ఆపై ఉడికించుకున్న గుడ్లను ముక్కలుగా చేసి టోస్టుపై పరచండి. పైనుంచి చిటికెడు మిరియాలపోడి, కారం, ఉప్పు చల్లుకొని మరో బ్రెడ్ టోస్టుతో కప్పి వేయండి.
అంతే రుచికరమైన బాయిల్డ్-ఎగ్ టోస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయినట్లే. కమ్మగా తింటూ, వెచ్చగా ఓ కప్ప్ టీని ఆస్వాదిస్తూ ఈ సండేను ఫన్ డేగా మార్చుకోండి. ఇంకొకటి.. దుప్పట్లో దూరిన గుడ్డు- ఈ రెసిపీని కూడా ట్రై చేయండి.
సంబంధిత కథనం