Murgh Musallam । రుచిలో అమోఘం ఈ ముర్గ్ ముసల్లం.. చికెన్ వంటకాల్లో ఇది జాతిరత్నం!-relish the taste of murgh musallam here is the recipe in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Murgh Musallam । రుచిలో అమోఘం ఈ ముర్గ్ ముసల్లం.. చికెన్ వంటకాల్లో ఇది జాతిరత్నం!

Murgh Musallam । రుచిలో అమోఘం ఈ ముర్గ్ ముసల్లం.. చికెన్ వంటకాల్లో ఇది జాతిరత్నం!

HT Telugu Desk HT Telugu
Oct 09, 2022 01:19 PM IST

Murgh Musallam Recipe in Telugu: మీరు ఎప్పుడైనా ముర్గ్ ముసల్లం తిన్నారా? తినకపోతే మాత్రం కచ్చితంగా ఒకసారి దీని రుచి చూడండి, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. రెసిపీ ఇక్కడ అందించాం చూడండి.

<p>Murgh Musallam Recipe in Telugu</p>
Murgh Musallam Recipe in Telugu (Stock photo)

మీరు శాఖాహారులా అయితే ఏం చేయలేం. కానీ మీరు మాంసాహార ప్రియులైతే మీకోసం ఈరోజు అద్భుతమైన రెసిపీని పరిచయం చేస్తున్నాం. దానిపేరు ముర్గ్ ముసల్లం. ఇది మొఘలాయి వంటకాలు, అవధీ వంటకాల యొక్క సాంప్రదాయక వంటకం. దీని అలా ఇలా ఉంటుంది అని తిన్నవార్ చెప్తేనే నోరు ఊరుతుంది. అయితే ఇదేం అంతకష్టమైన వంటకం కాదు, చాలా తేలికైనదే. కాస్త ఓపికతో చేసుకుంటే అద్భుతమైన రుచిని ఆస్వాదించగలుగుతారు.

ముర్గ్ ముసల్లం రెసిపీలో వివిధ దశలు ఉంటాయి. ముందుగా చికిన్ మెరినేట్ చేసుకోవాలి, ఆ తర్వాత అందులో స్టఫింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత మసాలా దట్టించి చికెన్ ఫ్రై చేసుకోవాలి, ఆ తర్వాత ముసల్లం గ్రేవీ చేసుకోవాలి, ఈ గ్రేవీలో చికెన్ ఉడికించుకోవాలి. ఇదే ముర్గ్ ముసల్లం.

ఈ స్పెషల్ వంటకానికి కావలసిన పదార్థాలు, తయారీ విధాన ఇక్కడ అందిస్తున్నాం. చూసి, నేర్చుకోండి. ఆదివారం పండగచేసుకోండి.

Murgh Musallam Recipe కోసం కావలసినవి

  • 1 మొత్తం చికెన్ (1.25 గ్రాములు)
  • 1 స్పూన్ ఉప్పు
  • 1/4 కప్పు వెనిగర్

మెరినేషన్ కోసం

  • 2 టేబుల్ స్పూన్లు పెరుగు
  • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 స్పూన్ కారం
  • 1 స్పూన్ గరం మసాలా పొడి
  • 1 టీస్పూన్ జీలకర్ర పొడి
  • 1/4 స్పూన్ నల్ల మిరియాల పొడి
  • 1 స్పూన్ రాతి ఉప్పు లేదా చాట్ మసాలా
  • రుచికి తగినంత ఉప్పు
  • 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

చికెన్ లోపల స్టఫింగ్ కోసం

  • 1 మీడియం ఉల్లిపాయ తరిగినది
  • 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 చిన్న టమోటా తరిగిన
  • 1/2 స్పూన్ కారం
  • 1/2 స్పూన్ గరం మసాలా పొడి
  • 1/4 టీస్పూన్ పసుపు
  • 1/2 జీలకర్ర పొడిని
  • 1 స్పూన్ ధనియాల పొడి
  • తాజా కొత్తిమీర ఆకులు
  • 2 ఉడికించిన గుడ్లు

ముసల్లం గ్రేవీ కోసం

  • 3 మీడియం ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
  • 3 మీడియం టొమాటోలు సన్నగా తరిగినవి
  • 1 టీస్పూన్ కారం
  • 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
  • 1 tsp జీలకర్ర పొడి
  • 1 స్పూన్ రాతి ఉప్పు
  • రుచికి తగినంత ఉప్పు
  • తాజా కొత్తిమీర ఆకులు

ముసల్లం మసాలా కోసం

  • 6 జీడిపప్పు
  • 6 బాదం
  • 1 టేబుల్ స్పూన్ గసగసాలు
  • 2 లవంగాలు
  • 2 ఏలకులు
  • 1 దాల్చినచెక్క
  • 1 స్టార్ సోంపు చిన్నది
  • జాపత్రి చిన్నది
  • 4 మిరియాలు
  • 1/2 కప్పు పెరుగు
  • 2 పచ్చిమిర్చి
  • తాజా కొత్తిమీర

ముర్గ్ ముసల్లం తయారీ విధానం

  1. బాగా కండపట్టిన కోడిని ( మొత్తం చికెన్) తీసుకొని శుభ్రంగా కడిగి, దానికి అక్కడక్కడ చిన్న గాట్లు పెట్టండి.
  2. ఆపై కొద్దిగా ఉప్పు చల్లండి, వెనిగర్ కూడా చిలకరించండి. దీనిని ఇలా 10 నిమిషాల పాటు ఉంచి మళ్లీ నీటితో శుభ్రం చేసుకోవాలి.
  3. ఇప్పుడు మెరినేషన్ కోసం పేర్కొన్న పదార్థాలన్నింటినీ కలిపి ఆ పేస్టును మొత్తం చికెన్‌కు బాగా అద్దండి, లోపల కుహరంలో బాగా రుద్దండి.
  4. ఇప్పుడు మసాలా పట్టించిన కోడిని కనీసం 2 గంటల పాటు పక్కన పెట్టండి. రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టి మెరినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది.

స్టఫింగ్ చేయండిలా

  1. ఇప్పుడు స్టఫింగ్ కోసం మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా పాన్‌లో నూనె వేడిచేయండి.
  2. నూనె వేడయ్యాక ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసి, ఆ తర్వాత అల్లం వేసి వేయించాలి.
  3. ఆ తర్వాత స్టఫింగ్ కోసం పేర్కొన్న పదార్థాలన్నీ వేసి ఉడికించుకోవాలి.
  4. రెండు ఉడికించిన గుడ్లు కూడా వేసుకొని చిన్నమంట మీద ఒక 4 నిమిషాలు వేయించుకోవాలి.
  5. అంతే, ఈ టొమాటో గుడ్డు మిశ్రమాన్ని మెరినేట్ చేసుకున్న చికెన్ కుహరంలో స్టఫ్ చేసుకోవాలి.
  6. స్టఫ్ చేసిన తర్వాత దారంతో మొత్తం కుట్టేయాలి. కోడికాళ్లను రెండింటిని ఒక దగ్గరకు చేర్చి ముద్దలాగా కుట్టేయాలి.
  7. అనంతరం ఈ చికెన్‌ను మీడియం మంటమీద కొంచెం నూనెలో వేయించాలి. అన్ని వైపులా కోడిని కాల్చాలి.
  8. ఇప్పుడు ముసల్లం గ్రేవీ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా ముసల్లం మసాలా సిద్ధం చేసుకోవాలి.

ముసల్లం గ్రేవీ

  1. ముసల్లం మసాలా కోసం పేర్కొన్న పదార్థాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి.
  2. కొత్తిమీర, పెరుగును కూడా కలిపి గ్రైండ్ చేసుకోవడం వలన ఇది మంచి పేస్ట్ అవుతుంది.
  3. ఇప్పుడు ముసల్లం గ్రేవీ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా నూనె వేడిచేయాలి.
  4. ఆ తర్వాత ముసలం గ్రేవీ కోసం పేర్కొన్న పదార్థాలన్నీ నూనెలో వేయించుకోవాలి.
  5. ఉల్లిపాయలు, టొమాటో రంగుమారేంత వరకు ఉడికిన తర్వాత ముసల్లం మసాలా పేస్టు కలుపుకోవాలి.
  6. ముసల్లం మసాలా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉంటే ముసల్లం గ్రేవీ రెడీ అవుతుంది.
  7. ఇప్పుడు చివరి దశ, కోడిని నూనెలో వేయించిన కోడి పాన్ లో కోడిని అలాగే ఉంచి అందులో ఈ ముసల్లం గ్రేవీ వేసుకోవాలి.
  8. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని, మూతపెట్టి ముసల్లం గ్రేవీలో చికెన్ 15 నిమిషాలు ఉడికించుకోవాలి.
  9. చికెన్ మెత్తగా ఉడికేవరకు అన్ని వైపులా ఉడికించుకోవాలి. మాడకుండా కొద్దిగా నీరు పోస్తూ ఉండాలి.

ఉడికిన తర్వాత మీరు ఎంతో ఆశపడిన ముర్గ్ ముసల్లం రెడీ. దీని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఊరించుకుంటూ తినండి.

Whats_app_banner

సంబంధిత కథనం