తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Feature On Twitter Like Youtube: ట్విటర్ లో యూట్యూబ్ తరహాలో కొత్త ఫీచర్

New feature on Twitter like YouTube: ట్విటర్ లో యూట్యూబ్ తరహాలో కొత్త ఫీచర్

HT Telugu Desk HT Telugu

22 December 2022, 22:17 IST

  • New feature on Twitter like YouTube: ట్విటర్ యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ పాపులర్ మైక్రో బ్లాగింగ్ సైట్ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సారధ్యంలోకి వచ్చిన తరువాత వచ్చిన లేటెస్ట్ ఫీచర్ ఇది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

New feature on Twitter: ట్విటర్ ను భారీ మొత్తం వెచ్చించి టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్విటర్ స్టాఫ్ కు, మస్క్ కు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ట్విటర్ సీఈఓగా మస్క్ వద్దంటూ ఇటీవల ఒక పోల్ కూడా నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే యూజర్లకు ఆసక్తి గొలిపే ఒక కొత్త ఫీచర్ ను ట్విటర్(Twitter) అందుబాటులోకి తీసుకువచ్చింది.

view count feature on Twitter: వ్యూ కౌంట్(view count) సదుపాయం

యూజర్లు ట్వీట్ చేసిన తరువాత, తమ ట్వీట్ ను ఎంతమంది చూశారనే విషయాన్ని ట్వీట్ ఎనలటిక్స్(tweet analytics) ద్వారా, ట్వీట్ చేసిన వ్యక్తి మాత్రమే తెలుసుకునే వీలుండేది. తాజాగా, ట్వీట్ కు దిగువన ‘లైక్(Like)’, ‘రీట్వీట్(Retweet)’, ‘కామెంట్(comment)’ ఆప్షన్లకు పక్కన ‘వ్యూ కౌంట్’ (view count) ఆప్షన్ ను ట్విటర్ (Twitter)పొందుపర్చింది. దీని ద్వారా ఆ ట్వీట్ ను ఎంతమంది చూశారనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటివరకు ఈ సదుపాయం యూట్యూబ్(YouTube) లో మాత్రమే ఉంది. ఇప్పుడు ట్విటర్(Twitter) యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.

view count feature: కొందరికే కనిపిస్తోంది.

ప్రస్తుతానికి ఈ ‘వ్యూ కౌంట్’ (view count) ఆప్షన్ కొందరు యూజర్లకు మాత్రమే కనిపిస్తోంది. ట్విటర్ నుంచి కూడా ఈ విషయమై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. కొన్ని రోజుల క్రితం ఎలాన్ మస్క్ ఇలాంటి ఒక ఫీచర్ ను త్వరలో తీసుకురానున్నామని ప్రకటించారు. ఐఫోన్, ఆండ్రాయిడ్, వెబ్.. ఏ ప్లాట్ ఫామ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందో ఇంతవరకు స్పష్టత లేదు.

New feature for investors in Twitter: ఇన్వెస్టర్ల కోసం మరో కొత్త ఫీచర్

మరోవైపు, ఇన్వెస్టర్లు, ట్రేడర్లు, ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ కోసం కొత్త ఫీచర్ ను ఎలాన్ మస్క్ ట్విటర్ లో ప్రారంభించనున్నారు. మేజర్ స్టాక్స్(major stocks), ఈటీెఎఫ్స్(exchange tarded funds), క్రిప్టో కరెన్సీ(cryptocurrencies)లకు సంబంధించిన చార్ట్స్, గ్రాఫ్స్ ను, ఇతర వివరాలను యూజర్లు ట్విటర్ లోనే తెలుసుకునేలా ఈ ఫీచర్ ను రూపొందించారు. ట్వీట్ లో ఆ స్టాక్ పేరు ముందు డాలర్ ($) సింబల్ ను టైప్ చేయడం ద్వారా ఈ ఫెసిలిటీ పొందవచ్చు. ఆ డాలర్ ($) సింబల్ ను పెట్టడం ద్వారా అది క్లికబుల్(clickable) అవుతుంది. అక్కడ క్లిక్ చేసినప్పుడు యూజర్ ను ఆ వివరాలున్న పేజ్ లోకి తీసుకువెళ్తుంది.