Elon Musk to Resign: అలాంటి వ్యక్తి దొరికిన వెంటనే ట్విట్టర్ సీఈవోగా రాజీనామా చేసేస్తా: ఎలాన్ మస్క్
Elon Musk to Resign as Twitter CEO: ట్విట్టర్ సీఈవో పదవికి రాజీనామా చేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ పోల్‍లో యూజర్లు వ్యక్తం చేసిన అభిప్రాయానికే ఆయన కట్టుబడేందుకు నిర్ణయించుకున్నారు.
Elon Musk to Resign as Twitter CEO: ట్విట్టర్ సీఈవో పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన నేడు (డిసెంబర్ 21) అధికారికంగా ప్రకటించారు. “ట్విట్టర్ హెడ్ స్థానం నుంచి నేను తప్పుకోవాలా” అంటూ ఎలాన్ మస్క్ ఇటీవల ట్విట్టర్‌లో స్వయంగా ఓ పోల్ నిర్వహించారు. అయితే మస్క్ రాజీనామా చేయాలని ఈ పోల్‍లో పాల్గొన్న 57.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతో ట్విట్టర్ సీఈవో స్థానం నుంచి తప్పుకునేందుకే మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని నేడు ట్వీట్ చేశారు. వివరాలివే..
అలాంటి వ్యక్తి దొరికాక..
Elon Musk to Resign as Twitter CEO: ట్విట్టర్ సీఈవో స్థానానికి సరిపోయే వ్యక్తి దొరికిన వెంటనే తాను పదవి నుంచి తప్పుకుంటానని టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే దీన్ని కూడా తనదైన స్టైల్‍లో వెల్లడించారు. “ఈ బాధ్యతను చేపట్టేందుకు సరిపడే ఫూలిష్‍గా ఉండే వ్యక్తి దొరికిన వెంటనే నేను రాజీనామా చేస్తాను. ఆ తర్వాత, నేను సాఫ్ట్‌వేర్, సర్వర్స్ టీమ్‍ను నడిపిస్తాను” అని మస్క్ పేర్కొన్నారు.
పాపులర్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్ ట్విట్టర్‌ను అక్టోబర్‌లో కైవసం చేసుకున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఆ తర్వాత సీఈవో పరాగ్ అగర్వాల్‍తో పాటు చాలా మంది ఉన్నతాధికారులను తొలగించారు. అనంతరం ఏకంగా 4వేల వరకు ఉద్యోగులను తీసేశారు. సంస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. బ్లూటిక్‍కు కోసం సబ్‍స్క్రిప్షన్ చార్జీలతో పాటు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు తాను కూడా సీఈవో స్థానం నుంచి తప్పుకునేందుకు రెడీ అయ్యారు.
టాపిక్