Twitter paid subscription: ట్విటర్ బ్లూటిక్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ షురూ-twitter starts rolling out new paid subscription for blue tick verification badge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Twitter Starts Rolling Out New Paid Subscription For Blue Tick Verification Badge

Twitter paid subscription: ట్విటర్ బ్లూటిక్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ షురూ

Twitter paid subscription: వెరిఫికేషన్ బ్యాడ్జ్ పొందాలంటే ఇక సొమ్ములు చెల్లించాల్సిందే
Twitter paid subscription: వెరిఫికేషన్ బ్యాడ్జ్ పొందాలంటే ఇక సొమ్ములు చెల్లించాల్సిందే (REUTERS)

Twitter paid subscription: ట్విటర్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సేవలు అందుబాటులోకి వచ్చే ప్రక్రియను ఆరంభించింది.

Twitter paid subscription: ట్విటర్‌ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సేవలు అమల్లోకి తెచ్చే ప్రక్రియ ప్రారంభించింది. ట్విటర్‌ పగ్గాలు అందుకున్న ఇలాన్ మస్క్ వారం రోజుల్లోనే పెను మార్పులకు తెరతీశారు. ‘నన్ను రోజంతా తిట్టండి.. కానీ దానికి 8 డాలర్ల ఖర్చవుతుంది..’ అని ట్వీట్ చేసిన మస్క్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌పై మరింత స్పష్టతనిస్తూ పలు ట్వీట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

యూజర్లు ట్విటర్ బ్లూ న్యూవెర్షన్‌లో సైన్ అప్ చేసేందుకు మొబైల్ యాప్ సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌‌‌తో సిద్ధమైంది. దీనికి నెలకు 8 డాలర్ల చొప్పున ఛార్జీలు చెల్లించాలి. తద్వారా ఆయా యూజర్లకు బ్లూటిక్ మార్క్ లభిస్తుంది. ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి కొన్ని సరికొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా వారి ఫీడ్‌లో అడ్వర్టయిజ్‌మెంట్లు తక్కువగా ఉంటాయి.

‘ట్విటర్ బ్లూ‌కు నేటి నుంచి కొన్ని కొత్త ఫీచర్లు జత చేస్తున్నాం..’ అని ట్విటర్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఎస్తర్ క్రాఫోర్ట్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఇవి ఐఫోన్లలో మాత్రమే లభ్యమవుతాయని చెప్పారు. 7.99 డాలర్లు చెల్లించి ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ పొందాలని సూచించారు. కొత్త సేవలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇంకా లైవ్‌లోకి రాలేదని వివరించారు.

‘కొత్త ప్రోడక్ట్ ట్విటర్ బ్లూ ఇంకా లైవ్ కాలేదు. కానీ లాంచ్ ప్రక్రియ కొనసాగుతోంది. మేం ఎప్పటికప్పుడు యాప్ అప్‌డేట్ చేస్తున్న తీరును యూజర్లు గమనించవచ్చు. టెస్ట్ చేస్తూనే రియల్ టైమ్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నాం..’ అని ఆమె వివరించారు. ‘న్యూ బ్లూ వచ్చేస్తోంది..’ అంటూ ట్వీట్ చేశారు.

మొన్నటి శుక్రవారం ట్విటర్ ఉద్యోగులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మొత్తం 7,500 మంది ఉద్యోగులు ఉన్న ట్విటర్‌లో సగానికి సగం మందిని మస్క్ తొలగించారు.

ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ రీడిజైన్ ప్రక్రియను తొలి ప్రాధాన్యతగా చేపట్టాలని మస్క్ తన టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఆదేశించారు. దీంతో కొన్ని బృందాలు ఈ ఫీచర్ కోసం రాత్రింబవళ్లూ పనిచేస్తున్నాయి. నవంబరు 7కల్లా దీనిని లాంచ్ చేయాలన్న లక్ష్యంతో మస్క్ టీమ్ పనిచేస్తోంది.

ప్రస్తుతం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు 5 డాలర్లుగా ఉంది. అయితే దీనిలో కొన్ని ఫీచర్లు అందిస్తోంది. సౌలభ్యమైన రీడింగ్ మోడ్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ను మరింత మెరుగుపరుస్తూ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను కూడా ఈ సేవల్లోకి తీసుకొస్తోంది. ఇప్పటివరకు ట్విటర్ వెరిఫికేషన్ (బ్లూటిక్ బ్యాడ్జ్) ఫీచర్ ఉచితంగా ఉండేది. రాజకీయ నేతలు, ప్రభుత్వ సంస్థలు, జర్నలిస్టులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు.. ఇలా చాలా మంది ప్రొఫెషనల్స్ ఈ వెరిఫికేషన్ బ్యాడ్జ్ పొందుతుండేవారు. ఈ ప్రక్రియను ఇలాన్ మస్క్ ఎగతాళి చేశారు.

ఈ సరికొత్త ఫీచర్ ద్వారా పెద్ద సైజులో ఉన్న వీడియోలు, ఆడియో మెసేజ్‌లు పోస్ట్ చేయవచ్చు.

‘ఫేక్ ఖాతాలతో కూడిన బోట్స్ వంటి వాటితో మేం చేస్తున్న పోరులో మాకు మద్దతు ఇస్తున్నందున మీ ఫీడ్స్‌లో యాడ్స్ సగానికి కుదిస్తాం. అలాగే మీకు ఆసక్తికలిగించే యాడ్స్ మాత్రమే చూస్తారు..’ అని ట్విటర్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సేవల గురించి తెలిపింది.

ఇప్పటివరకు అడ్వర్టయిజ్మెంట్‌పైనే ప్రధానంగా ఆధారపడిన ట్విటర్ ఇకపై విభిన్న మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేయడం, కంటెంట్‌పై నియంత్రణ ఉంటుందని ఆయన ప్రకటించడం వంటి పరిణామాల నేపథ్యంలో కొందరు అడ్వర్టయిజర్లు ఇప్పటికే తమ ప్రకటలను తగ్గించేశారు.

WhatsApp channel