Mercedes Benz electric EQB launch : మెర్సిడెస్ నుంచి మరో రెండు కార్లు.. లాంచ్ ఎప్పుడంటే!
07 November 2022, 22:14 IST
- Mercedes Benz electric EQB launch date : మెర్సిడెస్ బెంజ్ఇండియా.. రెండు కార్లను ఒకేసారి లాంచ్ చేయనుంది. వాటి వివరాలు, లాంచ్ డేట్లను ఇక్కడ తెలుసుకోండి.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ
Mercedes Benz electric EQB launch date : 7 సీటర్ లగ్జరీ ఈవీని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది మెర్సిడెస్ బెంజ్ ఇండియా. ఈక్యూబీ ఈవీని డిసెంబర్ 2న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈవీ సెగ్మెంట్లో మెర్సిడెస్ బెంజ్‌కు ఈ ఏడాదిలో ఇది మూడో లాంచ్ కావడం విశేషం. ఇప్పటికే ఏఎంజీ ఈక్యూఎస్ 53 4ఎంఏటీఐసీ+, ఈక్యూఎస్ 580 4ఎంఏటీఐసీ మోడల్స్‌ను విడుదల చేసింది. ఐసీఈ(ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్)తో పాటు లగ్జరీ ఈవీని కలిపి మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేస్తుండటం ఇదే తొలిసారి!
బుకింగ్స్ షురూ..
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో జీఎల్బీ ఎస్యూవీ కూడా డిసెంబర్ 2నే లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది మెర్సిడెస్ బెంజ్ ఇండియా. ఆన్లైన్లో లేదా సమీప డీలర్‌షిప్‌కు వెళ్లి ఈ వాహనాలను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక్కో వాహనానికి రూ. 1.5లక్షలను చెల్లించాల్సి ఉంటుంది.
Mercedes Benz GLB : ఇలా రెండు వాహనాలను ఒకేసారి లాంచ్ చేసి.. ఇండియా మార్కెట్‌పై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది మెర్సిడెస్ బెంజ్. అంతేకాకుండా ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోను కూడా పెంచుకునేందుకు చూస్తోంది.
ఇండియాలో మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన జీఎల్ఎస్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. ఇక కొత్త జీఎల్బీకి.. 'మినీ జీఎల్ఎస్' అని పేరు ఉంది. జీఎల్ఎస్ తర్వాత.. ఇది రెండో 7 సీటర్ ఎస్‌యూవీగా నిలిచిపోనుంది. ఇక ఈక్యూబీ ఈవీతో ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియో కూడా పెరుగుతోంది. ఈ రెండు వాహనాలు యువత, కుటుంబాలను ఆకర్షిస్తాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా భావిస్తోంది.
Mercedes Benz electric EQB bookings : జీఎల్బీ లాంచ్‌తో.. ఇండియా లగ్జరీ ఆటోమోటివ్ సెగ్మెంట్లో అతిపెద్ద ఎస్యూవీ పోర్ట్‌ఫోలియో ఉన్న సంస్థగా మెర్సిడెస్ బెంజ్ నిలిచిపోనుంది. ఇప్పటికే ఈ సంస్థకు ఇండియాలో జీఎల్ఏ నుంచి జీ- క్లాస్ వరకు ఎస్యూవీ మోడల్స్ ఉన్నాయి.
ఈ రెండు వాహనాల ధరలు, ఫీచర్స్ వంటి వివరాలపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వీటి తోసం మెర్సిడెస్ బెంజ్ లవర్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు!