తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mercedes-benz Car Sales: ఇండియాలో 7,573 మెర్సిడెస్ బెంజ్ కార్లు సేల్..

Mercedes-Benz car sales: ఇండియాలో 7,573 మెర్సిడెస్ బెంజ్ కార్లు సేల్..

HT Telugu Desk HT Telugu

11 July 2022, 15:23 IST

google News
  • Mercedes-Benz car sales: ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ కార్లు ఈ క్యూ2లో 7,573 అమ్ముడయ్యాయి. అత్యధికంగా అమ్ముడైన త్రైమాసికంగా క్యూ2 నిలిచింది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసీ 400 4మాటిక్ ఎలక్ట్రిక్ వెహికిల్
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసీ 400 4మాటిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ (REUTERS)

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసీ 400 4మాటిక్ ఎలక్ట్రిక్ వెహికిల్

న్యూఢిల్లీ, జూలై 11: మెర్సిడెస్ బెంజ్ కార్లు ఈ క్యూ 2 త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైనట్టు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది. మొత్తంగా 7,573 కార్లు అమ్మి 56 శాతం పెరుగుదల నమోదు చేసింది. కంపెనీ గత ఏడాది ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో 4,857 మెర్సిడెస్ బెంజ్ కార్లు అమ్మింది.

కొత్త కార్ల ఆవిష్కరణ, ఇప్పటికే ఆవిష్కరించిన కార్లకు డిమాండ్ స్థిరంగా ఉండడం ఈ త్రైమాసికంలో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు పెరిగేందుకు దోహదపడ్డాయని మెర్సిడెస్ బెంజ్ సంస్థ తెలిపింది.

సరఫరా వైపు సవాళ్లు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక మార్కెట్లలో సవాళ్లు ఉన్నప్పటికీ సేల్స్ పెరగడం చెప్పుకోదగిన పరిణామమని వివరించింది.

రానున్న మరికొన్ని నెలల్లో సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ ఉంటుందని కంపెనీ అంచనా వేసింది.

‘మా ఉత్పత్తిని పెంచడం, కస్టమర్లకు కార్లను డెలివరీ చేయడం, వెయిటింగ్ పీరియడ్‌ని తగ్గించడమే మా ఫోకస్ పాయింట్. మా వద్ద 6,000 కంటే ఎక్కువ కార్ల సాలిడ్ ఆర్డర్ బ్యాంక్ ఉంది. ఇది మా మార్కెట్ ఔట్‌లుక్‌ను చాలా సానుకూలంగా మారుస్తుంది..’ అని కంపెనీ తెలిపింది.

గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుండి భారతీయ కస్టమర్ల కోసం తెచ్చిన కొన్ని మెర్సిడెస్-బెంజ్ మోడళ్లు కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తున్నందున మూడో త్రైమాసికం చాలా ఉత్తేజకరమైనదిగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

టాపిక్

తదుపరి వ్యాసం