తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Pulsar 400 : బజాజ్​ పల్సర్​ 400 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ లీక్​!

Bajaj Pulsar 400 : బజాజ్​ పల్సర్​ 400 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ లీక్​!

Sharath Chitturi HT Telugu

28 April 2024, 18:20 IST

    • Bajaj Pulsar 400 launch date : బజాజ్​ బైక్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​! బజాజ్​ పల్సర్​ 400 లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. ఆన్​లైన్​లో లీక్​ అయిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇదిగో.. బజాజ్​ పల్సర్​ 400!
ఇదిగో.. బజాజ్​ పల్సర్​ 400! (V12Allies.in/instagram)

ఇదిగో.. బజాజ్​ పల్సర్​ 400!

Bajaj pulsar 400 on road price Hyderabad : బైక్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​..! ఫ్లాగ్షిప్ బజాజ్ పల్సర్ 400 లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. మే 3, 2024న ఈ బైక్​ని లాంచ్​ చేయనుంది దిగ్గజ 2 వీలర్​ తయారీ సంస్థ బజాజ్​ ఆటో. కాగా.. లాంచ్​కు ముందే.. ఈ కొత్త బైక్​కి సంబంధించిన కొన్ని వివరాలు ఆన్​లైన్​లో లీకయ్యాయి. అఫార్డిబుల్​ ధరలో మంచి మంచి ఫీచర్స్​తో ఈ పల్స్​ 400 బైక్​ రెడీ అవుతోందని టాక్​ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బైక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూద్దాము..

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

బజాజ్​ పల్స్​ 400 బైక్​ విశేషాలు..

ఆన్​లైన్​లో లీక్​ అయిన డేటా ప్రకారం.. బజాజ్​ పల్సర్​ 400 బైక్​లో రీడిజైన్డ్​ ఫ్రంట్ ఫేస్- ట్యాంక్ ఉంటాయి. ముఖ్యంగా, పల్సర్ 400 లో ప్రొజెక్టర్ హెడ్​ల్యాంప్ సెటప్ ఉంటుంది. ప్రతి వైపు ట్విన్ డీఆర్ఎల్స్​ ఉంటాయి. ఆన్​లైన్​లో లీక్​ అయిన బైక్​ ఫొటోలను V12Allies.in అనే ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో ప్రదర్శించారు. అదనంగా.. టర్న్-బై-టర్న్ నావిగేషన్​ సహా స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీ ఫీచర్లతో పూర్తి డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ని ఊహాగానాలు సూచిస్తున్నాయి.

Bajaj pulsar 400 : డామినార్ 400 నుంచి ప్రేరణ పొందిన పల్సర్ 400 బైక్​.. స్ల్పిట్​ రివర్స్ ఎల్​సీడీ డిస్​ప్లేని వారసత్వంగా పొందవచ్చు. లేదా అప్​గ్రేడ్​ చేసిన ఫుల్-కలర్ డిస్​ప్లే కలిగి ఉండొచ్చు. డామినర్​ 400లో కనిపించే ఇంజినే.. ఈ కొత్త బైక్​లోనూ ఉండొచ్చు. ఇది.. 39 బీహెచ్​పీ పవర్​ 35 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

ఇదీ చూడండి:- Tata Altroz on road price Hyderabad : హైదరాబాద్​లో టాటా ఆల్ట్రోజ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

ట్రయంఫ్ స్పీడ్ 400, కెటిఎమ్ 390 డ్యూక్.. బీఎమ్​డబ్ల్యూ జీ310ఆర్ వంటి పోటీదారుల నుంచి భిన్నంగా.. ఈ పల్సర్​ ఏరోడైనమిక్ ప్రొఫైల్ ఉంటుందని తెలుస్తోంది.

బజాజ్ పల్సర్ 400 బైక్​లో వెడల్పాటి రియర్ టైర్, రెండు వైపులా 17 ఇంచ్​ చక్రాలు, స్టాండర్డ్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటాయి.

Bajaj pulsar 400 tp speed : పల్సర్ బైక్​ మొదటిసారి 2001 లో లాంచ్ అయ్యింది. అప్పటి నుంచి భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్​లో దూసుకెళుతోంది. గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది.

బజాజ్ పల్సర్ 400ని పక్కనపెడితే.. సీఎన్​జీ బైక్స్​ని లాంచ్​ చేస్తామని సంస్థ​ చెప్పిన మాటలతో మార్కెట్​ ఎగ్జైట్​ అయ్యింది. జూన్ 2024 లో ప్రారంభం కానున్న ఈ ఆవిష్కరణ.. ఆటోమోటివ్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.

తదుపరి వ్యాసం