2024 Bajaj Pulsar N250: కొత్త కలర్ స్కీమ్స్ తో 2024 బజాజ్ పల్సర్ ఎన్ 250 లాంచ్; ధరలో మార్పు లేదు..-in pics 2024 bajaj pulsar n250 updated with new features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2024 Bajaj Pulsar N250: కొత్త కలర్ స్కీమ్స్ తో 2024 బజాజ్ పల్సర్ ఎన్ 250 లాంచ్; ధరలో మార్పు లేదు..

2024 Bajaj Pulsar N250: కొత్త కలర్ స్కీమ్స్ తో 2024 బజాజ్ పల్సర్ ఎన్ 250 లాంచ్; ధరలో మార్పు లేదు..

Apr 12, 2024, 05:36 PM IST HT Telugu Desk
Apr 12, 2024, 05:36 PM , IST

  • 2024 ఎడిషన్ పల్సర్ ఎన్ 250 ని బజాజ్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ఎక్స్  షో రూమ్ ధరను రూ. 1.51 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో సరికొత్త కలర్ స్కీమ్స్ తో పాటు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.

బజాజ్ ఆటో 2024 పల్సర్ ఎన్ 250 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోటార్ సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ .1.51 లక్షలు.

(1 / 10)

2024 ఎడిషన్ పల్సర్ 250 ఎన్ లో రేసింగ్ రెడ్, పెర్ల్ మెటాలిక్ వైట్ అనే రెండు కొత్త కలర్ స్కీమ్ ను తీసుకువచ్చారు. బ్రూక్లిన్ బ్లాక్ కలర్ కూడా అందుబాటులో ఉంది. 

(2 / 10)

2024 ఎడిషన్ పల్సర్ 250 ఎన్ లో టెలిస్కోపిక్ యూనిట్ స్థానంలో ముందు భాగంలో 37 మిమీ అప్ సైడ్ -డౌన్ ఫోర్కులను ప్రవేశపెట్టారు.అలాగే, యుఎస్డీ ఫోర్క్స్ ను మరింత మెరుగుపర్చారు.

(3 / 10)

2024 ఎడిషన్ పల్సర్ 250 ఎన్ లో బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చే కొత్త ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను పొందుపర్చారు. ఇదే ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పల్సర్ ఎన్ 160, పల్సర్ ఎన్ 150 బైక్స్ లో కూడా ఉంది.

(4 / 10)

ఈ బైక్ లోని కొత్త ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో గేర్ పొజిషన్ ఇండికేటర్, మొబైల్ నోటిఫికేషన్ అలర్ట్స్, డిస్టాన్స్ టు ఎంప్టీ, సగటు మైలేజీ.. వంటి సమాచారాన్ని చూపిస్తుంది. వీటితో పాటు సాధారణ ట్రిప్ మీటర్, ఓడోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్ ఉంటాయి. 

(5 / 10)

ఈ బైక్ లో ఎడమ వైపున కొత్త స్విచ్ గేర్ ఉంది. రైడర్ మోటార్ సైకిల్ నడుపుతూనే కాల్స్ ను స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ‘బజాజ్ రైడ్ కనెక్ట్’ యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ ను ఈ మోటార్ సైకిల్ తో కనెక్ట్ చేయవచ్చు.

(6 / 10)

2024 ఎడిషన్ పల్సర్ 250 ఎన్ లో వెనుక టైర్ పరిమాణాన్ని పెంచారు. దీనితో స్టెబిలిటీ, హ్యాండ్లింగ్ మరింత మెరుగయ్యాయి.

(7 / 10)

బజాజ్ పోర్ట్ ఫొలియోలో ట్రాక్షన్ కంట్రోల్ తో వచ్చిన మొట్ట మొదటి మోటార్ సైకిల్ 2024 పల్సర్ ఎన్ 250.

(8 / 10)

అంతేకాదు., బజాజ్ నుండి రెయిన్, రోడ్ మరియు ఆన్ / ఆఫ్ అనే మూడు ఏబీఎస్ మోడ్స్ తో వచ్చిన మొదటి మోటార్ సైకిల్ కూడా  2024 పల్సర్ ఎన్ 250.

(9 / 10)

ఈ బైక్ లో 249 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్, ఆయిల్ కూల్డ్, టూ వాల్వ్ ఇంజన్ ను అమర్చారు. ఇది 8,750 ఆర్పీఎం వద్ద 24.1 బీహెచ్పీ శక్తిని, 6,500 ఆర్పీఎం వద్ద 21.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు